News July 16, 2024
తూ.గో జిల్లా పోలీస్ స్పందనకు 21 ఫిర్యాదులు
రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం అడిషనల్ ఎస్పీ ఎస్.ఆర్.రాజశేఖర్ రాజు పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై 21 ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు.
Similar News
News October 11, 2024
తూ.గో: పిడుగులు పడే ప్రమాదం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు పిడుగుల ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. కాకినాడ రూరల్, తుని, కోనసీమ, పెద్దాపురం, సామర్లకోట, రంపచోడవరం, మారేడుమిల్లి, రాజానగరం రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో పిడుగులు ప్రమాదం ఉందని ఫోన్‌లకు రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.
News October 11, 2024
తుని: చెరువులో మద్యం సీసాలు.. ఎగబడిన మద్యం ప్రియులు
తుని మండలం రాపాక శివారు చెరువులో 10 నుంచి 15 మూటల్లో మద్యం సీసాలు ఉండటంతో గురువారం స్థానికులు వాటి కోసం ఎగబడ్డారు. చెరువులో మద్యం ప్రియులు సీసాలను గంటల వ్యవధిలోనే తీసుకుపోయారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడకి చేరుకొని విచారణ చేపట్టారు. 2 రోజుల క్రితం కేఒ మల్లవరంలో మద్యం కేసులో నలుగురిని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారు భయపడి మద్యం సీసాలు చెరువులో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
News October 10, 2024
చింతూరు: జనజీవన స్రవంతిలో కలిసిన ఇద్దరు మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇరువురు మావోయిస్టు దళ సభ్యులు ASP పంకజ్ కుమార్ మీనా ఎదుట గురువారం లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముచ్చిక అయిత, మడకం హింగే ఉన్నారని అధికారులు ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. లొంగిపోయిన వారిని పోలీస్ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. మావోయిస్టులు ఉద్యమ బాట వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారికి ప్రభుత్వం తరుపు నుంచి అన్ని రాయితీలు కల్పిస్తామని ASP అన్నారు.