News March 15, 2025

తూ.గో జిల్లా ప్రజలకు గమనిక

image

వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లపై తూ.గో జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్.సురేశ్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర, జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాలను పరిశీలించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. ఇకపై ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సర్టిఫికెట్లు మంజూరు చేస్తామన్నారు. జిల్లాలోని ప్రజలు రాజానగరంలోని కంట్రోల్ అల్ట్ ఫిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సంప్రదించి సర్టిఫికెట్లు తీసుకోవాలన్నారు.

Similar News

News November 26, 2025

రాజమండ్రి రూరల్: దేశభక్తిని చాటిన విద్యార్థులు

image

రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని కలెక్టరేట్‌లో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, భారత స్వాతంత్ర్య పోరాట స్పూర్తిని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనలు సాగాయి. సంప్రదాయ భారతీయ కళ, సాహిత్య సోయగాలు ప్రతిఫలించిన ఈ కార్యక్రమాలు దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేశాయి.

News November 26, 2025

రాజమండ్రి: మాక్ అసెంబ్లీ విజేతలకు కలెక్టర్ అభినందన

image

విద్యాశాఖ నిర్వహించిన మాక్ అసెంబ్లీ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బుధవారం కలెక్టర్ కీర్తి చేకూరి జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, వారు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి మాక్ అసెంబ్లీలో 8 మంది విద్యార్థులు, జిల్లా స్థాయిలో 13 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆమె తెలిపారు.

News November 26, 2025

రాజ్యాంగ స్ఫూర్తితో బాధ్యతలు నిర్వర్తించాలి: కలెక్టర్

image

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో కలెక్టర్ కీర్తి చేకూరి డా. బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ నిజాయితీ, కర్తవ్య నిబద్ధతతో నిర్వర్తించాలని కోరారు. ప్రతి ఒక్కరూ నీతి, నిజాయితీతో రాజ్యాంగ స్ఫూర్తితో మెలగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.