News March 11, 2025
తూ.గో.జిల్లా ప్రజలారా ఇవాళ జాగ్రత్త.!

తూ.గో.జిల్లా ఇవాళ వేడెక్కనున్నది. ముఖ్యంగా భానుడు తన ప్రతాపాన్ని జిల్లాలోని సీతానగరం 38.6, తాళ్లపూడి 38.5, గోపాలపురం 38.4, గోకవరం 38.3, కోరుకొండ 38.3, రాజమండ్రి 37.9, రాజానగరం 37.5, డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. కొన్ని ప్రాంతాల్లో వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కాబట్టి వృద్ధులు, పిల్లలు జాగ్రతగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News March 22, 2025
రాజమండ్రి: వివాహం కావడం లేదని ఆత్మహత్య

వివాహం కావడం లేదని మనస్తాపం చెంది హుకుంపేట D-బ్లాక్‌కు చెందిన ఉరిటి రామ సుబ్రహ్మణ్యం (45) ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన తల్లి వెంకటలక్ష్మి శుక్రవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం రాజమండ్రిలోని ఒక ప్రైవేటు కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు.
News March 22, 2025
రాజమండ్రిలలో P4పాలసీ కార్యక్రమం

P4 పాలసీ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. P4 పాలసీ ద్వారా ప్రభుత్వం వెనుకబడిన కుటుంబాలను ప్రత్యక్షంగా దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అన్నారు. ప్రజల నిజమైన అవసరాలను తీర్చడం, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వారి అభివృద్ధికి తోడ్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
News March 21, 2025
రాజమండ్రిలో అధికారుల మెరుపు దాడులు

తూర్పుగోదావరి జిల్లాలో ఈగల్ టీం శుక్రవారం మెరుపు దాడులు చేసింది. పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసింది. రాష్ట్రంలోని యువత మత్తు పదార్థాలను ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నట్లు సమాచారం ఉండటంతో దాడులు నిర్వహించామని విజిలెన్స్ అధికారి ఎం.స్నేహిత, డ్రగ్స్ ఏడీ నాగమణి తెలిపారు. రాజమండ్రి గణేశ్ చౌక్ వద్ద ఉన్న ఓ మెడికల్ ఏజెన్సీలో ట్రెమడల్ మెడిసిన్ స్వాధీనం చేసుకున్నారు.