News January 9, 2025
తూ.గో జిల్లా మీదుగా నడిచే 4రైళ్లు రద్దు
విజయవాడ డివిజన్ పరిధిలోని సాంకేతిక మరమ్మతుల కారణంగా ఈ నెల 11, 12న జిల్లా మీదుగా నడిచే 4రైళ్లను రద్దు చేస్తూ డివిజనల్ రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 11న కాకినాడ పోర్టు- వైజాగ్, వైజాగ్- కాకినాడ పోర్టు (17267/17268), 12న గుంటూరు- వైజాగ్(17239), వైజాగ్- గుంటూరు(17240) రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News January 19, 2025
ప్రత్తిపాడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెందిన రాజామని శివ (22)పేరవరం నుంచి తుని పంక్షన్‌కు వెళుతుండగా లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్తిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.
News January 19, 2025
కూనవరం: ఆదివాసీల సామూహిక చేపల వేట
కూనవరం మండలం చిన్నారుకుర్ పెద్ద చెరువులో ఆదివారం ఆదివాసీలు సామూహిక చేపల వేట నిర్వహించారు. సంక్రాంతి తర్వాత సంప్రదాయంగా చేపల వేట చేస్తామన్నారు. నాలుగు మండలాల నుంచి 3000 మంది చిన్నా ,పెద్దా తేడా లేకుండా ఆదివాసీ పెద్దల సమక్షంలో చేపల వేట సాగించారు. గ్రామ పెద్దలు బంధువులు అందరికీ కబురు పెట్టి వారి సమక్షంలో వయసుతో నిమిత్తం లేకుండా ఈ వేట సాగిస్తారన్నారు.
News January 19, 2025
పిఠాపురంలో ఆర్మీ జవాన్ ఆత్మహత్య
పిఠాపురంలో అనకాపల్లి జిల్లా మాకవరపాలేనికి చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు బూరుగుపాలెంకు చెందిన గూనూరు భరత్(22)గా గుర్తించారు. ఏడాది క్రితం అగ్నివీర్ ఎంపికలో ఉద్యోగం పొందిన భరత్ శిక్షణ ముగించుకుని వెస్ట్ బెంగాల్‌లో ఉద్యోగం చేశాడు. ప్రేమించిన యువతి దూరమవుతుందని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని శనివారం రాత్రి గ్రామానికి తీసుకొచ్చారు.