News February 23, 2025

తూ.గో. జిల్లా TODAY TOP NEWS

image

➤ రాజమండ్రి: రేపు PGRS రద్దు ➤ గోకవరం: ఉచితంగా చికెన్, గుడ్లు పంపిణీ ➤ అనపర్తి: నల్లమిల్లి ఇంటికి మంత్రులు, ఎమ్మెల్యేలు ➤ రాజమండ్రి: చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు ➤ బిక్కవోలులో ఘనంగా సత్తెమ్మ తల్లి జాతర ➤ రాజమండ్రి: పార్లమెంటు పరిధిలో పర్యటించిన ఎంపీ ➤ దేవరపల్లి: చికెన్ షాపులు స్వచ్ఛందంగా మూసివేత ➤ రాజమండ్రి: ‘MLC అభ్యర్థి రాజశేఖర్‌ని గెలిపించండి’

Similar News

News November 26, 2025

రాజమండ్రి రూరల్: దేశభక్తిని చాటిన విద్యార్థులు

image

రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని కలెక్టరేట్‌లో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, భారత స్వాతంత్ర్య పోరాట స్పూర్తిని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనలు సాగాయి. సంప్రదాయ భారతీయ కళ, సాహిత్య సోయగాలు ప్రతిఫలించిన ఈ కార్యక్రమాలు దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేశాయి.

News November 26, 2025

రాజమండ్రి: మాక్ అసెంబ్లీ విజేతలకు కలెక్టర్ అభినందన

image

విద్యాశాఖ నిర్వహించిన మాక్ అసెంబ్లీ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బుధవారం కలెక్టర్ కీర్తి చేకూరి జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, వారు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి మాక్ అసెంబ్లీలో 8 మంది విద్యార్థులు, జిల్లా స్థాయిలో 13 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆమె తెలిపారు.

News November 26, 2025

రాజ్యాంగ స్ఫూర్తితో బాధ్యతలు నిర్వర్తించాలి: కలెక్టర్

image

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో కలెక్టర్ కీర్తి చేకూరి డా. బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ నిజాయితీ, కర్తవ్య నిబద్ధతతో నిర్వర్తించాలని కోరారు. ప్రతి ఒక్కరూ నీతి, నిజాయితీతో రాజ్యాంగ స్ఫూర్తితో మెలగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.