News October 9, 2024

తూ.గో: దసరాకు 16 ప్రత్యేక రైళ్లు

image

దసరాకు విజయవాడ-శ్రీకాకుళం, శ్రీకాకుళం-విజయవాడకు 16 ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ మంగళవారం తెలిపారు. విజయవాడ-శ్రీకాకుళానికి ఈ నెల 9, 10,11,12,14,15,16,17 తేదీల్లో ప్రత్యేక రైలు నడుస్తుందన్నారు. శ్రీకాకుళం-విజయవాడకు ఈ నెల 10,11,12,13,15,16,17,18 తేదీల్లో ప్రత్యేక రైలు తిరుగుతుందన్నారు. ఈ రైళ్లు నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, ద్వారపూడి స్టేషన్లో నిలుస్తాయన్నారు.

Similar News

News January 2, 2025

గండేపల్లి : అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

గండేపల్లి మండలం మురారి వద్ద బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో రాజమండ్రిలోని మోరంపూడికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. జగ్గంపేట వైపు నుంచి బైకుపై రాజమండ్రికి వెళ్తున్న వారు మురారి వద్ద డివైడర్‌ను ఢీ కొట్టారు. దీంతో నవీన్ చంద్ అక్కడిక్కడే మృతి చెందగా, సంతోశ్ జీఎస్ఎల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.

News January 2, 2025

నల్లజర్ల: సినిమా ముహూర్తాల సిద్ధాంతి సత్యనారాయణ కన్నుమూత

image

నల్లజర్ల మండలం సింగరాజుపాలేనికి చెందిన ప్రముఖ సిద్ధాంతి కొఠారు సత్యనారాయణ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన జ్యోతిష్య, వాస్తు, సినిమాకు ముహూర్తాలు పెట్టడంతో జిల్లా వాసులకు సుపరిచితుడు.

News January 1, 2025

కడియం: 4న గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్

image

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగనుంది. ఈ నెల 4న సాయంత్రం 6గంటలకు ఈవెంట్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర చిరంజీవి, రామ్ చరణ్ యువత కమిటీ సభ్యుడు ఏడిద బాబి తెలిపారు. మంగళవారం సాయంత్రం మహానాడు నిర్వహించిన మైదానాన్ని A-మీడియా ఛైర్మన్ నరేంద్ర వచ్చి పరిశీలించినట్లు ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు.