News October 9, 2024
తూ.గో: దసరాకు 16 ప్రత్యేక రైళ్లు
దసరాకు విజయవాడ-శ్రీకాకుళం, శ్రీకాకుళం-విజయవాడకు 16 ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ మంగళవారం తెలిపారు. విజయవాడ-శ్రీకాకుళానికి ఈ నెల 9, 10,11,12,14,15,16,17 తేదీల్లో ప్రత్యేక రైలు నడుస్తుందన్నారు. శ్రీకాకుళం-విజయవాడకు ఈ నెల 10,11,12,13,15,16,17,18 తేదీల్లో ప్రత్యేక రైలు తిరుగుతుందన్నారు. ఈ రైళ్లు నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, ద్వారపూడి స్టేషన్లో నిలుస్తాయన్నారు.
Similar News
News November 8, 2024
రాజానగరం: ‘ఏపీ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషి’
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆంగ్ల విభాగం, రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి, సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టడీస్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం – సదస్సు’ ముగింపు వేడుక జరిగింది. మంత్రి దుర్గేష్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు
News November 8, 2024
తూ. గో జిల్లాలో 11,13,450 మెట్రిక్ టన్నులు ఇసుక లభ్యత
తూ.గో జిల్లాలో 16 ఓపెన్ రీచ్‌ల ద్వారా 11,13,450 మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ పి. ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 22 డిసిల్టేషన్ పాయింట్స్‌లో 4,95,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామన్నారు. అందులో కొవ్వూరు డివిజన్ పరిధిలో ఆరు రీచ్‌లలో 2,52,500 మెట్రిక్ టన్నులు, రాజమండ్రి డివిజన్‌లో 16 రీచ్‌లలో 2,43,500 మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
News November 8, 2024
రాజమండ్రి ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం UPDATE
రాజమండ్రి ఎయిర్ పోర్టులో గురువారం విజయవాడకు చెందిన సుబ్బరాజు వద్ద 6 బుల్లెట్లు గుర్తించారు. పోలీసుల కథనం..తన వద్ద లైసెన్స్ గన్ ఉందని సుబ్బరాజు తెలిపాడు. వ్యాపార పనులకోసం HYD వెళ్తున్నానని, తన బ్యాగులో బుల్లెట్లు ఉన్న విషయం ముందే గుర్తించలేదన్నాడు. దీనిపై ఎస్సై శ్యామ్ సుందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బుల్లెట్లు స్వాధీనం చేసుకుని అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చామన్నారు.