News March 14, 2025

తూ.గో: నానమ్మ, మనవడు ఊరికి వస్తూ మృతి

image

దుద్దుకూరు NHపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. వారి వివరాలు.. గోపాలపురానికి చెందిన నానమ్మ మీరా తున్నాషా(55), మనవడు షహీర్(20)లు బైక్‌పై పంగిడి నుంచి వస్తుండగా దుద్దుకూరు వద్ద లారీని ఢీకొట్టారు. వారిని రాజమండ్రి ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మరణించారు. తున్నాషా భర్త హార్ట్ సర్జరీ చేయించుకోని ఇంటి వద్దే ఉంటున్నాడు. షహీర్ ఇటీవలే ఇంటర్ పరీక్షలు రాశాడు.

Similar News

News February 11, 2026

హుస్నాబాద్: 84.21 శాతం పోలింగ్

image

హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 20 వార్డులలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని 20 వార్డులలో మొత్తం 19,277 మంది ఓట్లకు గాను 16,192 (84.21%) ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు (7916), మహిళలు (8272), ఇతరులు (4) ఓటు వేశారు. పోలీసులు ఉదయం నుంచి పటిష్ట బందోబస్తు నిర్వహించగా, పోలింగ్ సమయం ముగియడంతో అధికారులు గేట్లు బంద్ చేశారు.

News February 11, 2026

గద్వాల: మున్సిపాలిటీల వారిగా పోలింగ్ ఇలా..!

image

గద్వాల జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 78.22% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో అయిజ మున్సిపాలిటీ అత్యధిక పోలింగ్‌తో అగ్రస్థానంలో నిలవగా, గద్వాల మున్సిపాలిటీలో పోలింగ్ కాస్త తక్కువగా నమోదైంది.
అయిజ 84.69% (అత్యధికం)
అలంపూర్ 81.18%
గద్వాల 74.57%
వడ్డేపల్లి 84.26%*

News February 11, 2026

NRPT: మద్దూరులో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు

image

నారాయణపేట జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల పరిధిలో పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 72.87 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మున్సిపాల్టీల వారిగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు..
నారాయణపేటలో 74.18 శాతం, కోస్గి 74.83%, మక్తల్ 65.83%, మద్దూరు 79.0 శాతం పోలింగ్ నమోదైంది. మద్దూరు మున్సిపాల్టీ పరిధిలో అత్యధికంగా 79.0 శాతం పోలింగ్ నమోదైంది.