News June 16, 2024

తూ.గో.: నాన్నే నా హీరో: డైరెక్టర్ సుకుమార్

image

నాన్నే తన హీరో అని అంటున్నారు మలికిపురం మండలం మట్టపర్రుకు చెందిన సినీ దర్శకుడు సుకుమార్. గ్రామానికి చెందిన బండ్రెడ్డి తిరుపతి రావునాయుడికి సుకుమార్‌తో పాటు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కాగా ఆయన జ్ఞాపకార్థం తోబుట్టువులతో వారు రూ.15లక్షల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి భవనం నిర్మించారు. తండ్రి బాధ్యతే పిల్లలను మంచివైపు నడిపిస్తుందని ఓ మూవీ విడుదల సందర్భంగా చెప్పారు.
☛ నేడు FATHERS డే

Similar News

News January 17, 2026

ఏపీ ఎన్జీవో హోమ్ అభివృద్ధికి చర్యలు: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

రాజమండ్రి ఏపీ ఎన్జీవో హోమ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘ స్వరూప్ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఎన్జీవో సంఘ ప్రతినిధులు కలెక్టరేట్‌లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భవనాన్ని ఆధునీకరించాలని కోరారు. ఈ సందర్భంగా సంఘం డైరీ, క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు.

News January 17, 2026

రాజమండ్రి: పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శిబిరాలు

image

తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల 19 నుంచి 31 వరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన గోడ పత్రికలను ఆయన విడుదల చేశారు. పశువుల ఉత్పాదకత పెంపు, వ్యాధుల నివారణపై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు.

News January 17, 2026

అందరినీ అలరించడం చిరంజీవికే సాధ్యం: వీవీ వినాయక్

image

ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శుక్రవారం తన స్వగ్రామమైన చాగల్లులో పర్యటించారు. సంక్రాంతి సెలవుల్లో స్నేహితులతో కలిసి సొంత థియేటర్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని వీక్షించారు. అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే మెగాస్టార్ ఆకాంక్ష అని ఆయన కొనియాడారు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షించారు. పండుగ పూట వినాయక్ రాకతో గ్రామంలో సందడి నెలకొంది.