News April 11, 2025
తూ.గో: నేడు పిడుగులతో కూడిన వర్షాలు

తూ.గో జిల్లాలో శుక్రవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాతావరణంలో మార్పులు రైతులను కలవర పెడుతున్నాయి. NOTE: పిడుగులు పడేటప్పుడు చెట్ల కింద ఉండకండి.
Similar News
News September 15, 2025
రాజమండ్రి: సెప్టెంబర్ 17 నుంచి ఉచిత వైద్య సేవలు

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం “స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమానికి సంబంధించిన ప్రచార గోడ ప్రతులను రాజమండ్రిలో జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి ఆవిష్కరించారు. జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే శిబిరాల ద్వారా మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు.
News September 15, 2025
రాజమండ్రి: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం

రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్డులో ఉన్న ఓ మసాజ్ సెంటర్ పై పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్పా, మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో నలుగురు యువతులు, ఐదుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులతో సహా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 15, 2025
మంత్రి కందులను కలిసిన తూ.గో కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం విజయవాడలో మంత్రి కందుల దుర్గేశ్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని ప్రధాన సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రికి వివరించారు. జిల్లాలో పర్యాటక, సాంస్కృతిక, సినీ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో వేగంగా అభివృద్ధి పనులు చేపడతామని కలెక్టర్ తెలిపారు.