News April 4, 2025

తూ.గో: నేడు పిడుగులు పడే అవకాశం

image

తూ.గో జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎక్స్‌లో పోస్టు చేసింది. పిడుగుల పడే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడిన విషయం తెలిసిందే. తూ.గో జిల్లా నల్లజర్లలో నిన్న మధ్యాహ్నం పలు గ్రామాల్లో వర్షం కురిసింది. ఈ అకాల వర్షాలకు పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 5, 2025

తూ.గో: అన్న కర్మకాండ రోజునే తమ్ముళ్లు మృతి

image

అంబాజీపేట మండలం గంగలకుర్రులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గత నెల 24న సూర్యనారాయణమూర్తి మృతి చెందగా అతని సోదరులు నాగరాజు, రామచంద్రరావు కర్మకాండం నిర్వహించారు. గోదావరిలో నదికి స్నానానికి బైకుపై వెళ్తుండగా వారిని టిప్పర్‌ ఢీకొట్టింది. అన్న దినకార్యం రోజునే ఇద్దరు సోదరులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

News April 5, 2025

రాజమండ్రి: గర్భిణిగా నాటకం ఆడిన మహిళ.. ఏమైందంటే?

image

గొడ్రాలు అనే నింద పడుతుందనే భయంతో ఓ వివాహిత గర్భణిగా నాటకం ఆడింది. పోలీసులు వివరాల ప్రకారం..దేవిపట్నం(M) ఇందుకూరిపేటకి చెందిన కొప్పిశెట్టి సంధ్యారాణిని గురువారం డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారు. తాను గర్భిణి కాదని తెలుస్తుందనే భయంతో ఆసుపత్రి నుంచి వెళ్లిపోయింది. కాకినాడలో ఆమె ఆచూకీ గుర్తించి విచారించగా.. 9నెలలు గుడ్డ ముక్కలు పెట్టుకుని గర్భం పెరుగుతున్నట్లు నమ్మించినట్లు ఆమె తెలిపింది.

News April 5, 2025

నిడదవోలు నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

image

ఈ నెల 6న భద్రాచలంలో సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు నిడదవోలు ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. భక్తులు యావన్మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన వివరించారు. భద్రాచలం రాముల వారి కళ్యాణాన్ని చూసి తరలించాలని పేర్కొన్నారు.

error: Content is protected !!