News February 27, 2025
తూ.గో: నేడే MLC ఎలక్షన్.. సర్వం సిద్ధం

ఉమ్మడి తూ.గో.జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద అధికార యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసింది. దీంతో పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. గోదావరి జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. 70 జోన్లలో 70 జోనల్ అధికారులు, 95మంది రూట్ ఆఫీసర్లను నియమించారు.
Similar News
News December 8, 2025
విమానాల రద్దు.. ఇండిగో షేర్లు భారీగా పతనం

ఇండిగో(ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్) షేర్లు ఇవాళ ట్రేడింగ్లో భారీగా పతనమయ్యాయి. సెషన్ ప్రారంభంలో ఏకంగా 7 శాతం నష్టపోయాయి. తర్వాత కాస్త ఎగసినా మళ్లీ డౌన్ అయ్యాయి. ప్రస్తుతం 406 పాయింట్లు కోల్పోయి(7.6 శాతం) 4,964 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గత 5 రోజుల్లో ఏకంగా 14 శాతం మేర నష్టపోయాయి. వారం రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేస్తున్నారు.
News December 8, 2025
వెంకటాపూర్: సర్పంచ్ పోరు.. ఇదే ప్రత్యేకత..!

మరికల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల నుంచి విజయ్ కుమార్ రెడ్డి, రాజేందర్ రెడ్డిలు పోటీ చేస్తున్నారు. ఈ పంచాయతీ జనరల్కు కేటాయించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయకుమార్ తల్లి కళావతమ్మ, బీఆర్ఎస్ నుంచి రాజేందర్ రెడ్డి తల్లి అనితలు పోటీ చేశారు. గత ఎన్నికల్లో కళావతమ్మ విజయం సాధించారు. మరి ఈ ఎన్నికల్లో ఎవ్వరిని విజయం వస్తుందో ఈనెల 14న తెలుస్తుంది.
News December 8, 2025
నిర్మల్: వాతావరణ శాఖ హెచ్చరిక

జిల్లాలో రాబోయే రోజుల్లో చలిగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం హెచ్చరించింది. ముఖ్యంగా డిసెంబర్ 10 నుంచి 13వ తేదీల మధ్య ఉదయం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని తెలిపారు. జిల్లా వాసులు సాయంత్రం తర్వాత తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలని, చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.


