News January 15, 2025
తూ.గో: పందేలలో పచ్చకాకిదే హవా

ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ కోడి పందేల జోరు మామూలుగా లేదు. అయితే అదృష్టాన్ని, సత్తాను పరీక్షించుకునే ఈ కోడి పందేలకు సైతం శాస్త్రాలు, ముహూర్తాలు ఉంటాయని పందెం రాయుళ్లు చెబుతున్నారు. ఈ మేరకు కుక్కుట శాస్త్రం ప్రకారం మంగళవారం జరిగిన కోడి పందేల్లో పచ్చ కాకి రంగు కోడి పుంజులు ఎక్కువగా గెలుపొందినట్లు తెలుస్తోంది.
Similar News
News January 9, 2026
సంక్రాంతి వేళ డ్రోన్ల నిఘా.. ఎస్పీ వార్నింగ్!

సంక్రాంతి వేళ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నర్సింహ కిషోర్ వెల్లడించారు. భద్రతలో భాగంగా డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచినట్లు తెలిపారు. నేర నియంత్రణకు పోలీస్ బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ స్థానికులకు అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు. పండుగ పూట ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.
News January 9, 2026
రాజమండ్రి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా జాబ్ మేళా

రాజమండ్రిలో శనివారం నిర్వహించే మెగా జాబ్ మేళా బ్రోచర్ను మాజీ ఎంపీ మార్గాని భరత్ గురువారం విడుదల చేశారు. మంజీర కన్వెన్షన్లో ఈ మెగా జాబ్ కార్యక్రమం జరగనుంది. ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులైన వారికి అక్కడికక్కడే నియామక పత్రాలు అందజేస్తామని భరత్ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని ఆయన కోరారు.
News January 8, 2026
రేపే రాజమండ్రిలో జాబ్ మేళా!

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 9న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ తెలిపారు. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగి 19-35 వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల వారు నేరుగా మోడల్ కెరీర్ సెంటర్లో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని సూచించారు.


