News January 30, 2025
తూ. గో: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 10 వరకు నామినేషన్ల దాఖలు, 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ, 27న ఉదయం 8.నుంచి సాయంత్రం 4.గంటల వరకు పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. కూటమి తరపున టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, పీడీఎఫ్ అభ్యర్థిగా డీవీ రాఘవకోటి పోటీ బరిలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
Similar News
News July 10, 2025
రాజమండ్రి: ఆత్మహత్యకు పాల్పడి వ్యక్తి మృతి

రాజమహేంద్రవరం ఓల్డ్ రైల్వే క్వార్టర్ సమీపంలో మెట్ల కుమార్ (30) ఆత్మహత్య చేసుకున్నట్లు బుధవారం పోలీసులు గుర్తించారు. గత నెల 23న ఇంట్లో బైక్, సెల్ఫోన్ వదిలి వెళ్లి, తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు. రైల్వే క్వార్టర్ శివాలయం సమీపంలో అతని మృతదేహం లభించింది. ఆత్మహత్య కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది.
News July 10, 2025
చాగల్లు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చాగల్లుకు చెందిన (59) శ్రీరంగం కృష్ణారావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, బుధవారం తెల్లవారుజామున రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంగళవారం రాత్రి చాగల్లులో కృష్ణారావు మోపెడ్ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఏఎస్ఐ వి.శ్రీనివాసరావు తెలిపారు.
News July 10, 2025
‘కడియం నర్సరీ అందాలు అద్భుతంగా ఉన్నాయి’

మహారాష్ట్రకు చెందిన కేంద్ర రైల్వే మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నేత శ్రీరామ్ సాహెబ్ దాన్వే బుధవారం కడియం మండలం కడియపులంకలోని శ్రీ సత్య దేవ నర్సరీని సందర్శించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి నర్సరీకి విచ్చేసి పలు రకాల మొక్కలను పరిశీలించారు. వాటి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. కడియం నర్సరీ అందాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.