News March 29, 2025
తూ.గో: పదో తరగతి పరీక్ష వాయిదా- DEO

ఈనెల 31న జరగాల్సిన టెన్త్ సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ ఎగ్జామ్‌ను ఏప్రిల్ 1న (మంగళవారం) నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు అన్నారు. సోషల్ పరీక్ష మంగళవారం యథావిధిగా జరుగుతుందని, విద్యార్థులు గమనించాలని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో 31న స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, మెటీరియల్‌ను తీసుకెళ్లొద్దని సిబ్బందికి స్పష్టం చేశారు.
Similar News
News February 27, 2026
తూ.గో: కల్తీ పాల ఘటనపై హెల్త్ బులెటిన్ విడుదల

కల్తీ పాల ఘటనలో రాజమండ్రిలోని వివిధ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న 15 మందిలో 11 మంది బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి వైద్య ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నలుగురు రోగుల పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు వెల్లడించింది. కాగా 11 మంది రోగులకు ఇప్పటికీ వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ ఘటనలో 5గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.
News February 27, 2026
తూ.గో: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. రేపే లాస్ట్!

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2026కు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్‌లో తప్పుల సవరణకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించినట్లు DEO కె.వాసుదేవరావు తెలిపారు. విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ, తదితర వివరాల్లో మార్పులు ఉంటే ఈనెల 28లోపు ఆన్‌లైన్‌లో సవరించుకోవాలని సూచించారు. ఇదేచివరి అవకాశమని, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండి గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
News February 27, 2026
పెన్షన్‌దారులకు శుభవార్త.. ఒకరోజు ముందుగానే ‘సామాజిక భరోసా’

మార్చి నెల ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే అందజేయనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అయితే, ఈసారి మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో, లబ్ధిదారుల సౌకర్యార్థం ఫిబ్రవరి 28వ తేదీ(శనివారం) నాడే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.


