News November 9, 2024

తూ.గో: పవన్ కళ్యాణ్‌కు తమ్మల రామస్వామి‌ కృతజ్ఞతలు

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాకినాడ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తుమ్మల రామస్వామి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం తనను కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్మన్‌గా నియమించినట్లు సమాచారం అందుకున్న తుమ్మల రామస్వామి (బాబు) హుటాహుటిన మంగళగిరి వెళ్లారు. అక్కడ జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News December 5, 2025

ఒత్తిడికి లోనుకాకుండా చదవాలి: కలెక్టర్

image

తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన మెగా PTM 3.0ను కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అన్నదేవరపేట ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్, అన్నదేవరపేట ప్రభుత్వ హైస్కూల్, వేగేశ్వరపురం ప్రభుత్వ హైస్కూల్‌లను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్.. ఒత్తిడికి లోనుకాకుండా చదవాలని, వెనుకబడిన సబ్జెక్టుల్లో ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు.

News December 5, 2025

రాజమండ్రి: 5000 కెమెరాలు..17 డ్రోన్‌లతో నిఘా

image

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 5 వేల సీసీ కెమెరాలు, 17 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపారు. గత 11 నెలల కాలంలో 1137 డ్రంక్ అండ్ డ్రైవ్, 399 పేకాట, 242 కోడి పందాలు, 126 సారా, 49 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. అదృశ్యమైన 136 మంది బాలికల్లో 133 మందిని గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.

News December 5, 2025

రాజమండ్రిలో నిలిచిన విమాన సర్వీసులు

image

పైలట్ల సమ్మె కారణంగా మధురపూడి విమానాశ్రయంలో సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. గురువారం హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, 3.30 గంటలకు రావాల్సిన విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన రిటర్న్‌ సర్వీసులను అధికారులు నిలిపివేశారు. అలాగే దిల్లీ, హైదరాబాద్‌ నుంచి రావాల్సిన పలు సర్వీసులు సుమారు 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.