News July 20, 2024

తూ.గో: ‘పిడుగులు పడతాయ్.. జాగ్రత్త’

image

తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు ప్రకటించారు. రాజమండ్రి రూరల్, అనపర్తి, కాకినాడ, కోనసీమ, సామర్లకోట, పెద్దాపురం, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ప్రజల చరవాణిలకు సంక్షిప్త సందేశాలు సైతం వచ్చాయి.

Similar News

News September 18, 2024

తూ.గో.: చిరుత కోసం అదనపు బోన్లు ఏర్పాటు

image

సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలలో బుధవారం చిరుత కదలికలు గుర్తించలేదని అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు. ట్రాప్ కెమెరాలను మారుస్తూ అదనపు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చిరుత కోసం ఏర్పాటు చేసిన బోనులలో కుక్కలు చిక్కుకుంటున్నాయని, దాని వల్ల ఇబ్బంది కలుగుతుందన్నారు. నివాస ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారణ కాలేదని, దివాన్ చెరువు అటవీ ప్రాంతంలోనే చిరుత ఉందన్నారు.

News September 18, 2024

అన్నవరం ఆలయంలో ముగ్గురిపై కేసు

image

అన్నవరం దేవస్థానానికి చెందిన ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదైనట్లు ఎస్సై కృష్ణమాచారి మంగళవారం తెలిపారు. తుని మండలం తేటగుంటలో ఈనెల 15న పేకాడుతున్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఆలయానికి చెందిన కె.కొండలరావు, ఐ.వి.రామారావు, జె.శ్రీనివాస్ లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

News September 18, 2024

గంగవరం: విద్యార్థినులతో HM అసభ్య ప్రవర్తన.. సస్పెండ్

image

గంగవరంలోని స్థానిక గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో HM విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు HM. రామకృష్ణను మంగళవారం విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం తెలిపారు. రామకృష్ణపై రహస్యంగా, సమగ్ర విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకొన్నామన్నారు.