News August 10, 2024
తూ.గో.: పేరెంట్స్ ప్రశ్నించినందుకు.. యువతి సూసైడ్

ఫోన్ మాట్లాడుతున్నావని పేరెంట్స్ ప్రశ్నించగా ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. నల్లజర్ల మండలం ఘంటావారిగూడేనికి చెందిన లక్ష్మి(18) ఓపెన్ ఇంటర్ చేస్తూ ఓ మెడికల్ షాప్‌లో పనిచేస్తోంది. తరచూ ఫోన్లో మాట్లాడుతుందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో కలతచెందిన ఆమె శుక్రవారం మధ్యాహ్నం అమ్మానాన్నకు ఫోన్ చేసి మిమ్మల్ని చూడాలని ఉందని కట్ చేసింది. వారు వచ్చేసరికి ఉరేసుకొని చనిపోయింది. కేసు నమోదైంది.
Similar News
News November 17, 2025
ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లో జమ: జేసీ

ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో మద్దతు ధర నేరుగా జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జేసీ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 3,240 మంది రైతులకు రూ.55.82 కోట్లు జమ చేసినట్లు సోమవారం రాజమండ్రిలో ఆయన వివరించారు. రైతులకు ఏ సమస్య ఎదురైనా వెంటనే 8309487151 నంబర్‌కు కాల్ చేసి తమ సందేహాలు, ఫిర్యాదులను తెలియజేయవచ్చని సూచించారు.

రాజమండ్రి: శబరిమలైకు ప్రత్యేక బస్సులు

శబరిమల భక్తుల నుంచి ఆర్టీసీ బస్సులకు అమితమైన ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగా రాజమండ్రి డిపో నుంచి సోమవారం ఐదు సూపర్ లగ్జరీ బస్సులు శబరిమల యాత్రకు బయలుదేరాయి. ఈ బస్సులు యాత్ర ముగించుకుని ఈ నెల 23న తిరిగి డిపోకు చేరుకుంటాయి. భక్తుల ఆదరణకు డిపో మేనేజర్ మాధవ్ కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు కోరితే వారి గ్రామాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడపడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.