News April 24, 2024
తూ.గో: పోలింగ్ రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 13 ఓటు హక్కు వినియోగించుకునేందుకు తూ.గో జిల్లాలోని వివిధ ప్రైవేటు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, దుకాణాలు, హోటళ్లలో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు కార్మికశాఖ సహాయ కమిషనర్ బి.ఎస్.ఎం. వల్లి తెలిపారు. ఓటుహక్కు ఉన్న కార్మికులందరికీ పోలింగ్ రోజున సెలవు మంజూరు చేయాలని ఆయా సంస్థల యాజమాన్యాన్ని కోరారు.
Similar News
News July 9, 2025
రాజమండ్రి: ఆర్టీసీలో 9 మందికి కారుణ్య నియామకాలు

ఉమ్మడి తూ.గో జిల్లాలో మంగళవారం ఆర్టీసీలో కారుణ్య నియామకాలు జరిగాయి. సహజ మరణాలతో పాటు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు ఈ నియామకాలు జరిగాయి. స్థానిక ఆర్ఎం కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో తూ.గో జిల్లా డీపీటీవో వైఎస్ఎన్ మూర్తి , కాకినాడ డీపీటీవో ఎం. శ్రీనివాసరావు, కోనసీమ డీపీటీవో రాఘవ కుమార్లు పాల్గొని 9 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.
News July 9, 2025
అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు: ఎస్పీ

మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల అక్రమ నిల్వలు ఎవరు కలిగి ఉన్నా ఉపేక్షించేది లేదని, ఆయా షాపు యజమానులపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డి. నరసింహ కిషోర్ హెచ్చరించారు. “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్” లో భాగంగా మంగళవారం జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్కూళ్లు, కాలేజీలకు100 గజాల దూరంలో ఉన్న షాపులలో పొగాకు, గుట్కా నిల్వల పై సోదాలు చేసి కేసులు పెట్టమన్నారు. స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తామని చెప్పారు.
News July 9, 2025
ధవళేశ్వరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఇసుక లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ధవళేశ్వరంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు పెయింటింగ్ పని చేసుకుని జీవించే పువ్వుల లక్ష్మణరావు (39) మంగళవారం రాజమండ్రిలో పని కోసం వెళ్తుండగా ఇసుక లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.