News March 3, 2025
తూ.గో: పోస్టల్ బ్యాలెట్‌లో 42 చెల్లని ఓట్లు

ఉభయ గోదావరి జిల్లాల గ్యాడుయేట్ MLC ఎన్నికల కౌంటింగ్ ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో కొనసాగుతోంది. ఇందులో మొత్తం పోస్టల్ బ్యాలెట్‌లో 243 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వ్యాలిడ్ (చెల్లుబాటు అయ్యే) ఓట్లు 201, ఇన్ వ్యాలిడ్ (చెల్లని) ఓట్లు 42 వచ్చినట్లు సమాచారం.
Similar News
News March 18, 2025
తెనాలిలో ఎన్నారై కుటుంబంలో విషాదం

అమెరికా నార్త్ కరోలినాలో తెనాలికి చెందిన ఎన్నారై కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తెనాలి అయితానగర్‌కు చెందిన గడ్డం థామస్ కుమార్తె షారోన్ సధానియేల్‌కు, అమెరికాకు చెందిన సథానియేల్ లివిస్కాతో 2007లో వివాహం కాగా అమెరికాలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తుఫాను కారణంగా భారీ వృక్షం కూలి వీరి ఇంటిపై పడటంతో ఇంట్లో నిద్రిస్తున్న కుమారులు మృతి చెందారు.
News March 18, 2025
హసన్‌పర్తి: యాక్సిడెంట్.. ఇద్దరు విద్యార్థులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పరకాల బీసీ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు సుశాంత్, వర్ధన్, విజయ్ ఆదివారం రాత్రి పరకాల నుంచి ఎర్రగట్టు జాతరకు బయలుదేరారు. సుశాంత్ బైక్ నడుపుతుండగా.. విజయ్, వర్ధన్ వెనుక కూర్చున్నారు. ముచ్చర్ల శివారులో వీరి బైకును ఓ వాహనం ఢీకొనడంతో సుశాంత్, విజయ్ మృతి చెందారు. వర్ధన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు.
News March 18, 2025
బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ నరసింహ

యువత, విద్యార్థులు బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. ఆన్ లైన్ గేమ్స్ ఆడి యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని చెప్పారు. బెట్టింగ్ ఆడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిందని, దానిని మంచికి వినియోగించాలన్నారు.