News May 10, 2024

తూ.గో.: ప్రచారం @ మరో 24 గంటలే

image

ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచారపర్వం మరో 24గంటల్లో ముగియనుంది. ఇన్నిరోజులు పార్టీల అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున సినీ ప్రముఖులు, స్టార్ క్యాంపెయినర్ల రాకతో తూ.గో. జిల్లా నిత్యం వార్తల్లో నిలిచింది. మరోవైపు జనసేనాని పవన్ పిఠాపురం నుంచి పోటీచేయడంతో రాజకీయం మరింత ఆసక్తిగా మారింది. రేపు సాయంత్రం 6వరకే అవకాశం ఉండగా అభ్యర్థులు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.

Similar News

News November 5, 2025

రాజమండ్రి: పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు ఆహ్వానం

image

జిల్లాలో పర్యాటక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక అధికారి పి. వెంకట చలం బుధవారం ప్రకటించారు. జలక్రీడలు, సాహస క్రీడలు, లగ్జరీ హౌస్ బోట్లు, పార్టీ బోట్ల వంటి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆసక్తి గల వారు www.tourism.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు చూడవచ్చని, లేదా 9505011951 / 6309942025 నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

News November 5, 2025

రాజమండ్రి: సాయిబాబా శత జయంతికి కలెక్టర్‌కు ఆహ్వానం

image

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి సందర్భంగా పుట్టపర్తిలో ఈ నెల 13 నుంచి 25వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని కలెక్టర్ చేకూరి కీర్తికి శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు బుధవారం ఆహ్వాన పత్రిక అందించారు. ఉత్సవాలకు ప్రధాని మోదీతో హాజరవుతున్నారని తెలిపారు. కలెక్టర్ తప్పనిసరిగా విచ్చేయాలని వారు కోరారు.

News November 5, 2025

రాజమండ్రి: ఇళ్లు లేని పేదలకు కేంద్రం తీపికబురు

image

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు గృహ వసతి కల్పించేందుకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకం 2.0 కింద అర్హులను గుర్తించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో నవంబర్ 30వ తేదీ లోగా అర్హులైన పేదల వివరాలు సేకరించాలని కలెక్టర్ హౌసింగ్ అధికారి ఎన్. బుజ్జిని ఆదేశించారు.