News May 10, 2024
తూ.గో.: ప్రచారం @ మరో 24 గంటలే

ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచారపర్వం మరో 24గంటల్లో ముగియనుంది. ఇన్నిరోజులు పార్టీల అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున సినీ ప్రముఖులు, స్టార్ క్యాంపెయినర్ల రాకతో తూ.గో. జిల్లా నిత్యం వార్తల్లో నిలిచింది. మరోవైపు జనసేనాని పవన్ పిఠాపురం నుంచి పోటీచేయడంతో రాజకీయం మరింత ఆసక్తిగా మారింది. రేపు సాయంత్రం 6వరకే అవకాశం ఉండగా అభ్యర్థులు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.
Similar News
News February 13, 2025
కొవ్వూరులో హీరో రామ్ సినిమా షూటింగ్

సినీ హీరో రామ్ పోతినేని 22వ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో జరిగింది. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. మంగళవారం ఆరికిరేవుల స్నానఘట్టం, గోదావరి నది వద్ద సన్నివేశాలను చిత్రీకరించారు. మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తుండగా హీరోయిన్‌గా భాగ్యశ్రీ ,రావు రమేష్, బ్రహ్మానందం, హర్షవర్దన్‌లు నటిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపారు.
News February 12, 2025
తూ.గో: చికెన్, గుడ్ల సరఫరా నిలిపివేత

కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో తూ.గో జిల్లా వ్యాప్తంగా ఎస్సీ హాస్టల్స్‌లో గుడ్లు, చికెన్ సరఫరాను నిలిపివేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి శోభారాణి తెలిపారు. గుడ్లకు బదులుగా బ్రేక్‌ఫాస్ట్‌లో పాలు, ఆదివారం మటన్ కర్రీ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని వార్డెన్లకు సూచించారు. అలాగే జిల్లాలోని అన్ని స్కూళ్లలో గుడ్ల సరఫరా నిలిపివేశారు.
News February 12, 2025
తూ.గో: వండిన చికెన్‌నే తినాలి

తూ.గో జిల్లా పెరవలి మండలంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వండిన చికెన్ మాత్రమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు. 75 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకూ ఉడకపెట్టాలన్నారు. చికెన్, గుడ్లు చేతితో తాకితే శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. ఎవరికైనా జ్వరం, తలపోటు, జలుబు లక్షణాలు వస్తే వైద్య సిబ్బందికి సమాచారం అందిచాలన్నారు.