News November 4, 2024
తూ.గో : ప్రాణం తీసిన క్రెడిట్ కార్డు

తూ.గో జిల్లాలో ఓ క్రెడిట్ కార్డు యువకుడి మృతికి కారణమైంది. గండేపల్లి(M) పి.నాయకంపల్లికి చెందిన సత్యసాయి(22) బ్రాయిలర్ కోళ్లు పెంచుతున్నాడు. ఈక్రమంలో గత నెల 30న ఫ్రెండ్ క్రెడిట్ కార్డుతో రూ.1000 పెట్రోల్ కొట్టించుకున్నాడు. ఈ విషయం అతనికి తెలిస్తే అవమానంగా ఉంటుందని భావించాడు. అదే రోజు రంగంపేట మండలం కోటపాడు సమీపంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా మృతదేహాన్ని గుర్తించారు.
Similar News
News October 28, 2025
అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి: తూ.గో కలెక్టర్

అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిపై సోమవారం క్షేత్రస్థాయి అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలో 9 మండలాలు, 303 గ్రామాలు తుఫాన్‌తో ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. 12 మండల కంట్రోల్ రూములు, 184 పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
News October 27, 2025
రాజమండ్రి: ఇంటర్ విద్యార్థులకు గమనిక

ఇంటర్ విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా ఫీజు చెల్లించాలసి ఉంటుందని ఆర్ఐవో NSVL నరసింహం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ జనరల్, ఒకేషనల్, రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులంతా తమ పరీక్ష ఫీజును ఈ గడువులో చెల్లించాలని చెప్పారు. గడువు దాటితే రూ.1000 ఫైన్‌తో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
News October 27, 2025
ప్రజల భద్రతే తమ ప్రాధాన్యత: కలెక్టర్

జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చే అవకాశం ఉందని APSDMA రెడ్ అలర్ట్ ఇచ్చినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం సూచించారు. 50-60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలవవద్దని హెచ్చరించారు. సోమవారం, మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.


