News July 7, 2024
తూ.గో.: ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాలేదని.. సూసైడ్
నిడదవోలుకు చెందిన ఓ యువతి (22) కోనసీమ జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రాజేష్ రెండేళ్లుగా ప్రేమించున్నారు. ప్రియుడికి ఏడాది క్రితం మరో యువతితో వివాహమైంది. రాజేష్‌ను రెండో పెళ్లి చేసుకుంటానని యువతి పేరెంట్స్‌తో చెప్పగా నిరాకరించారు. మనస్తాపంతో తాడేపల్లిగూడెంలో తాను నర్సుగా పనిచేస్తున్న ఆసుపత్రిలో శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మెరుగైన చికిత్సకోసం విజయవాడ తరలించగా చికిత్సపొందుతూ చనిపోయింది.
Similar News
News December 12, 2024
పి.గన్నవరం: గల్లంతైన బాలుడు మృతదేహం లభ్యం
పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతా వారి పేట వద్ద పంట కాలువలో గల్లంతైన బాలుడు మృతదేహం బుధవారం లభ్యమైంది. మంగళవారం విహారయాత్ర ముగించుకుని కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారు ఎగిరి పడ్డారు. ఇందులో నేలపూడి ఉమ (31), పెద్ద కుమారుడు రోహిత్ (9) మృతదేహాలు అదే రోజు లభ్యమయ్యాయైన విషయం తెలిసిందే. పోలీసులు మనోజ్ మృతదేహన్ని పోస్టుమార్టానికి తరలించారు.
News December 12, 2024
పి.గన్నవరం: గల్లంతైన బాలుడు మృతదేహం లభ్యం
పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతా వారి పేట వద్ద పంట కాలువలో గల్లంతైన బాలుడు మృతదేహం బుధవారం లభ్యమైంది. మంగళవారం ఉదయం గల్లంతైన మనోజ్ (5) మృతదేహం లభ్యం కావడంతో ముగ్గురు మృతదేహలు లభ్యమయ్యాయి. నేలపూడి ఉమ (31), పెద్ద కుమారుడు రోహిత్ (9) మృతదేహాలు మంగళవారం లభ్యమైన సంగతి విధితమే. విహారయాత్ర ముగించుకుని కారులో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టనికి తరలించారు.
News December 12, 2024
తూ.గో: పేలిన ఛార్జింగ్ బైక్.. తప్పిన ప్రమాదం
రాజానగరం మండలం చక్రద్వారబంధంలో బుధవారం సాయంత్రం ఎలక్ట్రికల్ బైక్ దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతు చిక్కాల రాఘవ ఏడాది క్రితం రాజమండ్రిలోని ఓ షోరూంలో ఎలక్ట్రికల్ బైక్ కొనుగోలు చేశారు. ఈక్రమంలో పొలం నుంచి ఇంటికి వస్తుండగా సీటు కింద ఉన్న బ్యాటరీ నుంచి శబ్దం వచ్చింది. ఆగి చూసేసరికి ఒక్కసారిగా మంటలు ఎగసి క్షణాల్లోనే కాలిబూడిదైందని బాధితుడు వాపోయారు.