News November 29, 2024
తూ.గో: ఫుల్ టెన్షన్… వారందరికీ కునుకు కరవు

తుపాను ప్రభావంతో ఉమ్మడి తూ.గో జిల్లా వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఆరుగాలం పండించిన పంట నీటిపాలవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని అధికారులు హెచ్చరించారు.
Similar News
News January 3, 2026
ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా జేసీ వై.మేఘా స్వరూప్

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ముస్సోరీలో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 5 నుంచి 30 వరకు ఆమె లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో ఉండనున్నారు. కలెక్టర్ గైర్హాజరీలో జేసీ వై.మేఘా స్వరూప్ జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
News January 3, 2026
ఏపీపీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం

ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్ టెస్టులను ఈ నెల 5, 7, 10 తేదీల్లో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్వో టి.సీతారామమూర్తి తెలిపారు. శనివారం రాజమండ్రిలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐవోఎన్ డిజిటల్ జోన్, రాజీవ్ గాంధీ విద్యా సంస్థల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
News January 3, 2026
ధవళేశ్వరం: ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు.. గంజాయి నిందితుడికి జైలు

ధవళేశ్వరం ఎర్రకొండకు చెందిన గంజాయి నిందితుడు బహదూర్ రామ్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. ఇతనిపై స్థానికంగానే కాకుండా హైదరాబాద్ చందానగర్‌లోనూ కేసులు ఉన్నాయని సీఐ టి.గణేశ్ శనివారం వెల్లడించారు. నిందితుడిలో మార్పు రాకపోవడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా ఆదేశాల మేరకు పీటీ యాక్ట్ నమోదు చేశారు. నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


