News September 7, 2024
తూ.గో.: ఫ్రెండ్ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

తూ.గో. జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు <<14036102>>మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. వివరాలు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రవీణ్, పల్నాడు జిల్లాకు చెందిన కార్తిక్ రాజమండ్రిలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. సెమిస్టర్ పరీక్షలకు చదువుకునేందుకు ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రవీణ్కు గుండెలో నొప్పిరావడంతో అందరూ కలిసి రాజమండ్రిలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరగా యాక్సిడెంట్ జరిగింది.
Similar News
News January 10, 2026
కొవ్వూరు: గోదావరిలో దూకబోయిన వ్యక్తిని రక్షించిన పోలీసులు

కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వాదలకుంటకు చెందిన వినపల్లి నవీన్ను పట్టణ పోలీసులు రక్షించారు. 112 ద్వారా సమాచారం అందుకున్న కానిస్టేబుల్ సూరిబాబు సకాలంలో చేరుకుని యువకుడు నదిలో దూకకుండా అడ్డుకున్నారు. కుటుంబ సమస్యలే దీనికి కారణమని సీఐ పి.విశ్వం తెలిపారు. సకాలంలో స్పందించి ప్రాణం కాపాడిన పోలీసుల తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
News January 9, 2026
సొంతూళ్లకు వెళ్తున్నారా?.. SP కీలక సూచనలు

సంక్రాంతి సెలవులకు వెళ్లే ప్రజలు తమ ఇళ్ల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు. తాళం వేసిన ఇళ్లే దొంగల లక్ష్యమని, విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచాలని కోరారు. పోలీసుల ‘లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్’ (LHMS) యాప్ను వినియోగించుకోవడం ద్వారా దొంగతనాలకు చెక్ పెట్టవచ్చని, ప్రయాణ సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.
News January 9, 2026
పాసు పుస్తకాల్లో తప్పులు.. 16 వేల బుక్కులు వెనక్కి!

రీ సర్వేలో భాగంగా ముద్రించిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులు దొర్లడంతో 16,101 పుస్తకాలను వెనక్కి పంపినట్లు తూ.గో. డీఆర్వో సీతారామమూర్తి శుక్రవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 1,04,618 పుస్తకాలను పరిశీలించగా ఇవి వెలుగుచూశాయన్నారు. బ్యాంకుల్లో తాకట్టు ఉన్న పాత పుస్తకాలను ఇచ్చి కొత్తవి తీసుకోవాలని కలెక్టర్ సూచించినట్లు పేర్కొన్నారు. రైతులు తమ వివరాలను సరిచూసుకోవాలని అధికారులు వెల్లడించారు.


