News August 26, 2024

తూ.గో: బదిలీల కోసం దరఖాస్తుల ఆహ్వానం: డిఎం అండ్ హెచ్వో

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఏఎన్ఎం, వార్డు హెల్త్ సెక్రటరీలు తమ బదిలీ దరఖాస్తులను మంగళవారం లోపు సమర్పించాలని కాకినాడ జిల్లా డీఏం అండ్ హెచ్ఓ నరసింహనాయక్ తెలిపారు. దరఖాస్తులను http://gramawardsachivalayam.ap.gov.in/gswslms/login సైట్‌లో ఆన్‌లైన్‌లో సమర్పించాలని తెలిపారు. అలాగే హార్డ్ కాపీలు కాకినాడలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో అందించాలన్నారు.

Similar News

News October 31, 2025

రాజమండ్రి ఎంపీపై కేసు నమోదు చేయాలి: జేటీ రామారావు

image

ఏపీలో అణువిద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను ప్రజలు వ్యతిరేకిస్తుంటే అదానీ కోసం రాజమండ్రి ఎంపీ పురంధీశ్వరి అమెరికాతో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటీ రామారావు గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఆమె పర్యటనపై సమగ్ర విచారణ జరిపి.. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. శ్రీకాకుళం(D) కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం కోసం USకు చెందిన వెస్టింగ్ హౌజ్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయన్నారు.

News October 31, 2025

నవంబర్ 7న రెడ్ క్రాస్ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక

image

నవంబర్ 7న రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లా రెడ్‌క్రాస్ శాఖలో సభ్యత్వం కలిగిన పేట్రాన్, వైస్ పేట్రాన్, లైఫ్ మెంబర్స్, లైఫ్ అసోసియేట్ సభ్యులంతా తప్పక హాజరు కావాలన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖకు నూతన మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

News October 30, 2025