News June 3, 2024
తూ.గో.: బరిలో 25 మంది మహిళలు
ఉమ్మడి తూ.గో.లో MP, MLA స్థానాల నుంచి 25మంది మహిళలు బరిలో ఉన్నారు. అయితే వీరిలో ఎవరు విజయం సాధిస్తారనేది ఆసక్తి. రాజమండ్రి పార్లమెంట్‌కు పురందీశ్వరి (BJP), బాల నవీన (స్వతంత్ర), కాకినాడ పార్లమెంట్‌కు అనూష యాదవ్ (BCYP) పోటీ చేశారు. కోనసీమ జిల్లాలో కొత్తపేట నుంచి ఒకరు, రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు అసెంబ్లీలకు ఇద్దరు చొప్పున పోటీచేశారు. కాకినాడ, తూ.గో. జిల్లాలో 16 మంది పోటీ చేశారు.
Similar News
News September 19, 2024
చిరుతను పట్టుకునేందుకు 100 ట్రాప్ కెమెరాలు: భరణి
చిరుత పులిని పట్టుకునేందుకు 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని తూ.గో. జిల్లా అటవీ శాఖ అధికారి భరణి గురువారం తెలిపారు. గత రాత్రి శ్రీరాంపురం, పాలమూరు ప్రాంతాల్లో చిరుత సంచరించినట్లు వచ్చిన సమాచారం అవాస్తవమన్నారు. నిపుణుల బృందం పాదముద్రలు పరిశీలించగా అవి అడవి పిల్లి పాద ముద్రలుగా నిర్ధారణ జరిగిందన్నారు. ట్రాప్ కెమెరాలో అడవి పిల్లిని గుర్తించడం జరిగిందని తెలిపారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు.
News September 19, 2024
తూ.గో: 24లోపు స్కాలర్షిప్ పరీక్ష కోసం దరఖాస్తులు
తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈనెల 24వ తేదీలోపు నేషనల్ మెయిన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు తెలిపారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరంలో గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. https://www.bse.ap.gov.in ఆసక్తి గల విద్యార్థులందరూ ఈ వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News September 19, 2024
తూ.గో: కూటమి 100 రోజుల పాలనపై మీ కామెంట్?
ఉమ్మడి తూ.గో జిల్లాలో 19 అసెంబ్లీ సీట్లను క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. జిల్లాలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్నక్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. మీ ఎమ్మెల్యే పనితీరుపై కామెంట్ చేయండి.