News November 20, 2024

తూ.గో: ‘బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు’

image

సారా అమ్మకాలు, బెల్ట్ షాప్‌లు, పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తూ.గో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాల నిర్మూలనకు తాము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నేరాలకు పాల్పడిన వారిన ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని ఈ సందర్భంగా చెప్పారు. తాళ్లపూడి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన అనంతరం మాట్లాడారు.

Similar News

News December 26, 2024

శంఖవరం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

శంఖవరం మండలం వేలంగి-పెద్దమల్లాపురం మధ్య బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నవరం పోలీసుల వివరాల మేరకు.. పెదమల్లాపురానికి చెందిన బోడోజు వెంకట రమణ (18), బలుం సుబ్రహ్మణ్యం (24) బైక్‌పై వేళంగి నుంచి పెదమల్లాపుంకు వెళ్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. దీంతో ఇద్దరు మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 26, 2024

తాళ్లపూడి: కాలువలో మునిగి బాలుడి మృతి

image

తాళ్లపూడి మండలం బల్లిపాడులో నాలుగేళ్ల బాలుడు కాలువలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం మేరకు గురువారం బల్లిపాడు ఎస్సీ నివాసిత ప్రాంతంలో కాలువ గట్టున బాలుడు ఆడుకుంటూ కాలువలో పడ్డాడు. ఎవరూ గమనించకపోవడంతో మృతి చెందాడని తెలిపారు. తల్లి ఝాన్సీ రాణి రోదన చూపరులకు కన్నీరు తెప్పించింది. 

News December 26, 2024

పి.గన్నవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

image

పి.గన్నవరం మండలం ఊడిమూడిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. పి. గన్నవరం నుంచి రావులపాలెం వైపు వెళ్తున్న ఆటోకు కుక్క అడ్డు రావటంతో దానిని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ తో పాటు మరో మహిళకు గాయాలు కావడంతో వారిని స్థానికులు పి.గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.