News November 20, 2024
తూ.గో: ‘బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు’
సారా అమ్మకాలు, బెల్ట్ షాప్‌లు, పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తూ.గో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాల నిర్మూలనకు తాము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నేరాలకు పాల్పడిన వారిన ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని ఈ సందర్భంగా చెప్పారు. తాళ్లపూడి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన అనంతరం మాట్లాడారు.
Similar News
News December 7, 2024
9న తేదీన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ రద్దు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని ఈనెల 9వ తేదీన నిర్వహించడం లేదని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. శనివారం ఆయన కాకినాడ కలెక్టరేట్ నుండి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అనివార్య కారణాల వలన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
News December 7, 2024
ఈ నెల 10 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు: తూ.గో కలెక్టర్
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీ నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరం లోని కలెక్టరేట్ నుంచి ఆమె శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామాలలో భూ, రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
News December 6, 2024
కాకినాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 14 మందికి జైలు శిక్ష
కాకినాడలో 42 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. నిందితులను కాకినాడ మూడో స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జడ్జి వి.నరసింహారావు ముందు హాజరుపరిచారు. వారిలో 14 మందికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష పడింది. 28 మందికి రూ.10 వేలు చొప్పున రూ.2,80,000 జరిమానా వేశారు.