News October 15, 2024

తూ.గో: భారీ వర్షాలు, కంట్రోల్ రూమ్ నంబర్లు..ఇవే

image

భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సమస్యలు ఉంటే అధికారులు నిత్యం అందుబాటులో ఉండేలా జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏవైనా కరెంట్ సమస్యలు ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి.
➤రాజమండ్రి సర్కిల్-7382299960
➤కాకినాడ డివిజన్-9493178718
➤పెద్దాపురం డివిజన్-9493178728
➤అమలాపురం డివిజన్-9440904477
➤రామచంద్రపురం డివిజన్-9493178821

Similar News

News November 8, 2024

తూ.గో: ‘ధ్రువపత్రంతో ఇసుకను తీసుకెళ్లొచ్చు’

image

రాజమండ్రిలోని కోటిలింగాల, ధవళేశ్వరం గాయత్రీ ర్యాంపు వద్ద ప్రజలకు ఇసుక లభ్యత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ పనులకు ఇసుకను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ట్రాక్టర్ల ద్వారా నేరుగా ఇసుకను తీసుకెళ్లొచ్చన్నారు. జిల్లాలో కొత్తగా కొవ్వూరు డివిజన్ పరిధిలో 8 డిసిల్టేషన్ పాయింట్స్ 4,95,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామన్నారు.

News November 8, 2024

తూ.గో: TODAY TOP NEWS

image

*గోకవరం: షర్మిలను కలిసిన కాంగ్రెస్ నాయకులు
*కాకినాడ: దీపం-2 పథకంపై జేసీ సమీక్ష
*పి.గన్నవరం: పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఎమ్మెల్యే గిడ్డి
*తుని: మహిళ అదృశ్యంపై కేసు నమోదు
*పవన్ కళ్యాణ్‌తో హోంమంత్రి అనిత భేటీ
*జగ్గంపేట: టీటీడీ ఛైర్మన్‌ను కలిసిన MLA నెహ్రూ
*గొల్లప్రోలు: బాలిక అదృశ్యంపై హోంమంత్రి ఆరా
*రాజమండ్రి: చంద్రబాబు ఫోటోకు మహిళలు పాలాభిషేకం
*రాజమండ్రి ఎయిర్ పోర్టులో బుల్లెట్లు కలకలం

News November 7, 2024

తూ.గో: 4,02,331 ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్

image

తూ.గో.జిల్లాలో దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్‌లను పొందేందుకు 4,02,331 బుకింగ్స్ అవ్వగా వాటిలో 3,59,462 మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు రాజమహేంద్రవరంలో తెలిపారు. మొదటి గ్యాస్ సిలిండర్ను లబ్ధిదారులు పొందేందుకు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అవకాశం ఉందన్నారు. లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.