News June 28, 2024
తూ.గో.: మంత్రి లోకేశ్ను కలిసిన జడ్పీ మాజీ ఛైర్మన్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీఛైర్మన్ నామన రాంబాబు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు డొక్కా నాగబాబు ఉన్నారు.
Similar News
News December 9, 2025
తూ.గో: డిప్యూటీ సీఎం శాఖలో జీతాల కష్టాలు

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ శాఖలో ఉద్యోగులు జీతాలు అందక ఆకలి కేకలు వేస్తున్నారు.
తూ.గో జిల్లా నీటి నాణ్యత పరీక్షా కేంద్రాల సిబ్బందికి ఆగస్టు నుంచి ఐదు నెలల వేతనాలు అందలేదు. క్రిస్మస్, సంక్రాంతి సమీపిస్తున్న వేళ జీతాలు రాకపోవడంతో వేతన జీవుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వెంటనే బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
News December 9, 2025
తూ.గో: విదేశీ ఉద్యోగాల ఎర.. రూ.4 కోట్లకు టోకరా

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి రూ. 4 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసం నిడదవోలు మండలం గోపవరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. యంట్రపాటి విజయలక్ష్మి, భాగ్యం తదితరులు తమను నిండా ముంచారని బాధితులు వాపోయారు. డబ్బులు తిరిగి అడిగితే ముఖం చాటేస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ సోమవారం కలెక్టర్, జిల్లా జడ్జికి వారు ఫిర్యాదు చేశారు.
News December 9, 2025
విదేశీ ఉద్యోగాల ఎర.. రూ.4 కోట్లకు టోకరా