News February 4, 2025
తూ.గో: ‘మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవాలి’

జిల్లాలో ప్రభుత్వం గీత కులాలకు కేటాయించిన 13 మద్యం షాపులకు ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి చింతాడ లావణ్య సోమవారం ఓ ప్రకటనలో కోరారు. జిల్లా వ్యాప్తంగా 13 షాపులలో జిల్లాకలెక్టర్, బీసీవెల్ఫేర్ ఆఫీసర్, బీసీ కులసంఘాల ప్రతినిధుల సమక్షంలో తీసిన లాటరీలో 11 శెట్టిబలిజ కులానికి, 01 గౌడ కులానికి, 01 గౌడ్ కులానికి కేటాయించడం జరిగిందన్నారు.
Similar News
News October 28, 2025
అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి: తూ.గో కలెక్టర్

అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిపై సోమవారం క్షేత్రస్థాయి అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలో 9 మండలాలు, 303 గ్రామాలు తుఫాన్తో ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. 12 మండల కంట్రోల్ రూములు, 184 పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
News October 27, 2025
రాజమండ్రి: ఇంటర్ విద్యార్థులకు గమనిక

ఇంటర్ విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా ఫీజు చెల్లించాలసి ఉంటుందని ఆర్ఐవో NSVL నరసింహం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ జనరల్, ఒకేషనల్, రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులంతా తమ పరీక్ష ఫీజును ఈ గడువులో చెల్లించాలని చెప్పారు. గడువు దాటితే రూ.1000 ఫైన్తో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
News October 27, 2025
ప్రజల భద్రతే తమ ప్రాధాన్యత: కలెక్టర్

జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చే అవకాశం ఉందని APSDMA రెడ్ అలర్ట్ ఇచ్చినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం సూచించారు. 50-60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలవవద్దని హెచ్చరించారు. సోమవారం, మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.


