News December 18, 2024
తూ.గో: మహిళను స్వదేశానికి రప్పించిన మంత్రి

గల్ఫ్ దేశాల్లో చిక్కుకుని,తనను రక్షించమని కార్మిక శాఖ మంత్రిని వేడుకున్న గంటా దీప్తి అనే మహిళ మంత్రి సుభాష్ చొరవతో స్వదేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి సుభాష్ని బాధిత మహిళ కుటుంబ సభ్యులతో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ..ఏజెంట్లు మాయాజాలానికి ప్రజలు మోసపోవద్దని సూచించారు. బాధితులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుదన్నారు. ఏజంట్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
Similar News
News November 28, 2025
మారిన తూ.గో స్వరూపం.. పెరిగిన ఓటర్ల సంఖ్య

జిల్లాల పునర్విభజనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా స్వరూపం మరోసారి మారనుంది. మండపేట నియోజకవర్గం అదనంగా చేరడంతో జిల్లాలో మండలాల సంఖ్య 21కి, నియోజకవర్గాల సంఖ్య ఏడు నుంచి ఎనిమిదికి పెరిగాయి. నవంబర్ 11 నాటికి జిల్లా ఓటర్ల సంఖ్య 16,23,528 ఉండగా, మండపేట నియోజకవర్గం చేరికతో మొత్తం ఓటర్ల సంఖ్య 18,37,852 కు పెరిగింది.
News November 28, 2025
తూర్పు గోదావరి జిల్లాలో బడి బస్సులపై ప్రత్యేక డ్రైవ్

విద్యాసంస్థలకు చెందిన బస్సుల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసేందుకు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 వరకు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు డీటీఓ ఆర్. సురేశ్ తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ డ్రైవ్కు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో 2,000కు పైగా బస్సులను నాలుగు ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తాయని డీటీఓ వివరించారు.