News April 24, 2024
తూ.గో.: మహిళ దారుణహత్య

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం రెళ్లుగడ్డలో మంగళవారం బొంతు మణికుమారి (30) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాత్రూంలో మాటువేసిన ఆగంతకుడు గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు. హత్య సమయంలో డోరు లోపల గడియ వేసిఉందని, కిటికీ లోంచి ఆమె తోడికోడలు, కుమారుడు చూసి కేకలు వేశారు. ఎస్ఐ హరీష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Similar News
News November 11, 2025
తూ.గో: 10వ తరగతి విద్యార్థులకు గమనిక

తూ.గో జిల్లాలో 2026లో జరిగే SSC/OSSC/వొకేషనల్ పరీక్షలకు ఫీజుల చెల్లింపు నోటిఫికేషన్ విడుదలైందని DEO కె.వాసుదేవరావు తెలిపారు. రెగ్యులర్, ఒకసారి ఫెయిలైన విద్యార్థుల ఫీజు చెల్లింపు షెడ్యూల్ HMలకు పంపామన్నారు. ఈనెల 13 నుంచి 25వ తేదీలోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు కట్టవచ్చన్నారు. రూ.50 ఫైన్‌తో 26 నుంచి డిసెంబర్ 3 వరకు, రూ.200 ఫైన్‌తో డిసెంబర్ 11వరకు, రూ.500 ఫైన్‌తో డిసెంబర్ 15లోపు చెల్లించాలన్నారు.
News November 11, 2025
పదేళ్లుగా బ్యాంకు ఖాతాల్లో నిలిచిపోయిన నగదు

తూ.గో జిల్లాలోని పలు బ్యాంకుల్లో లావేదేవీలు జరగకపోవడంతో పదేళ్లలో రూ.97.12 కోట్లు ఖాతాదారుల ఖాతాలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వ్యక్తి గత ఖాతాలు 5,09,614 కాగా నగదు రూ.75.05 కోట్లు ఉందన్నారు. పరిశ్రమలు ఖాతాలు 20,180 కాగా రూ.4.21 కోట్లుగా వెల్లడించారు. ప్రభుత్వ ఖాతాలు 5,154 కాగా రూ.4.21 కోట్లుగా నిర్ధారించారు. ఈ నగదు e-KYC, నామినీ పేర్లు తదితర వివరాలు సరిగా లేకపోవడంతో బ్యాంకులో నిల్వ ఉందన్నారు.
News November 11, 2025
రాజమండ్రి: ‘ఇప్పుడు ఇంటి పన్ను కట్టడం నిమిషాల్లో పని’

జిల్లా ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం రూపొందించిన ‘స్వర్ణ పంచాయతీ’ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఇంటి పన్నులు చెల్లించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో ‘ఇంటి పన్ను చెల్లింపుల అవగాహన పోస్టర్’ ఆవిష్కరణ జరిగింది. ఈ కొత్త విధానం ద్వారా కేవలం ఫోన్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఇంటి పన్నులు సులభంగా చెల్లించవచ్చన్నారు.


