News November 4, 2024

తూ.గో: మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్

image

తూ.గో.జిల్లాకు చెందిన నాగమణి అనే మహిళ బహ్రెయిన్ వెళ్లి ఇబ్బంది పడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువచ్చింది. దీనిపై స్పందించిన లోకేశ్ ఆమెను రాష్ట్రానికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చారు. దీనిపై నాగమణి లోకేశ్‌కు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. తనను ముగ్గురు ఏజెంట్లు మోసం చేశారని ఆమె వాపోయారు.

Similar News

News November 11, 2025

తూ.గో జిల్లాలో 8,773 ఇళ్ల నిర్మాణం పూర్తి

image

తూ.గో జిల్లాలో 8,773 మంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారని హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్(PD) నాతి బుజ్జి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం గృహప్రవేశాలు చేస్తారని చెప్పారు. అన్ని నియోజక వర్గాల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులు సమక్షంలో గృహప్రవేశాలు వేడుకగా నిర్వహిస్తామన్నారు. గోకవరం మండలం కామరాజుపేటలో జరిగే కార్యక్రమానికి కలెక్టర్ హాజరవుతారన్నారు.

News November 11, 2025

తూ.గో జిల్లా ఇమ్యూనిజేషన్ అధికారిగా శ్రీదేవి

image

తూ.గో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా డాక్టర్ బి.శ్రీదేవి నియమితులయ్యారు. ఈ మేరకు DMHO కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె DMHO కె.వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. అలాగే డిప్యూటీ డెమోగా పి.సత్యవతి బాధ్యతలు స్వీకరించారు.

News November 11, 2025

తూ.గో: 10వ తరగతి విద్యార్థులకు గమనిక

image

తూ.గో జిల్లాలో 2026లో జరిగే SSC/OSSC/వొకేషనల్ పరీక్షలకు ఫీజుల చెల్లింపు నోటిఫికేషన్ విడుదలైందని DEO కె.వాసుదేవరావు తెలిపారు. రెగ్యులర్, ఒకసారి ఫెయిలైన విద్యార్థుల ఫీజు చెల్లింపు షెడ్యూల్ HMలకు పంపామన్నారు. ఈనెల 13 నుంచి 25వ తేదీలోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు కట్టవచ్చన్నారు. రూ.50 ఫైన్‌తో 26 నుంచి డిసెంబర్ 3 వరకు, రూ.200 ఫైన్‌తో డిసెంబర్ 11వరకు, రూ.500 ఫైన్‌తో డిసెంబర్ 15లోపు చెల్లించాలన్నారు.