News May 26, 2024
తూ.గో: ముగ్గురికి పరీక్ష.. విధుల్లో 20 మంది

‘పది’ సప్లిమెంటరీ హిందీ పరీక్షలో భాగంగా శనివారం తూ.గో జిల్లా కొవ్వూరు పరిధిలో ఓ వింత పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 3 పరీక్షా కేంద్రాలకు 80 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, ముగ్గురు మాత్రమే వచ్చారు. PMMM స్కూల్లో 25 మందికి గానూ 1, ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో 31 మందికి 1, బాలికోన్నత పాఠశాలలో 24 మందికి ఒకరు పరీక్ష రాశారు. ఈ ముగ్గురి కోసం 20 మంది టీచర్లు విధులు నిర్వహించారు.
Similar News
News November 25, 2025
నిడదవోలు రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

నిడదవోలు పురపాలక సంఘం వజ్రోత్సవ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ సోమవారం ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన నిడదవోలు మున్సిపాలిటీ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. గణపతి సెంటర్లో జరిగే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తారని మంత్రి వెల్లడించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
News November 25, 2025
24 గంటల్లో ధాన్యం చెల్లింపులు తప్పనిసరి: మంత్రి నాదెండ్ల

రాజమండ్రి కలెక్టరేట్లో ఖరీఫ్ ధాన్యం సేకరణపై మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ అధ్యక్షతన సమీక్ష జరిగింది. ధాన్యం కొనుగోలు చేసిన 24గంటల్లోపు రైతులకు చెల్లింపులు చేయాలని మంత్రి మనోహర్ ఆదేశించారు. ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖ పనితీరు మెరుగుపడాలని సూచించారు.