News May 26, 2024
తూ.గో: ముగ్గురికి పరీక్ష.. విధుల్లో 20 మంది

‘పది’ సప్లిమెంటరీ హిందీ పరీక్షలో భాగంగా శనివారం తూ.గో జిల్లా కొవ్వూరు పరిధిలో ఓ వింత పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 3 పరీక్షా కేంద్రాలకు 80 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, ముగ్గురు మాత్రమే వచ్చారు. PMMM స్కూల్‌లో 25 మందికి గానూ 1, ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో 31 మందికి 1, బాలికోన్నత పాఠశాలలో 24 మందికి ఒకరు పరీక్ష రాశారు. ఈ ముగ్గురి కోసం 20 మంది టీచర్లు విధులు నిర్వహించారు.
Similar News
News February 17, 2025
RJY: ఎన్టీఆర్‌ను పరిచయం చేసిన నిర్మాత ఇకలేరు

ఎన్టీఆర్, ఘంటసాల వంటి సినీ ప్రముఖులను వెండితెరకు పరిచయం చేసిన నటి, గాయని, నిర్మాత కృష్ణవేణి (102) ఆదివారం హైదరాబాద్‌లో మరణించారు. ఆమె తూర్పుగోదావరి జిల్లాలోని పంగిడిగూడెం గ్రామంలో 1924లో జన్మించారు. మహిళలు బయటకు రాని కాలంలో భర్తతో కలిసి 1936 శోభనాచలం స్టూడియోను స్థాపించి ‘సతీ అనుసూయ’ చిత్రాన్ని నిర్మించారు. 1948లో మనదేశం సినిమాతో ఎన్టీఆర్‌ను తొలిసారి వెండితెరకు పరిచయం చేశారు.
News February 17, 2025
తూ.గో: పది విద్యార్థులకు మిగిలింది 28 రోజులే

విద్యార్థులకు పదో తరగతి కీలకమైనది. పదో తరగతి పరీక్షలకు 28 రోజులే ఉన్నాయని డీఈవో వాసుదేవరావు అన్నారు. రాజమండ్రిలో ఎస్‌కేవీటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పది విద్యార్థుల ప్రత్యేక తరగతులను ఆదివారం పరిశీలించారు. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. త్వరగా నిద్ర పోవడం తెల్లవారు జామున లేచి సాధన చేయడంతో ఎక్కువ గుర్తు పెట్టుకోవచ్చన్నారు.
News February 17, 2025
రాజమండ్రి: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

తూ.గో జిల్లాలో కూరగాయలు సాగు చేస్తున్న రైతులు స్థానిక మార్కెట్లలో లేదా దళారులకు తక్కువ ధరలకు వాటిని అమ్మి నష్టపోవద్దని జేసీ చిన్నరాముడు సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల కష్టాన్ని దళారీల వ్యవస్థ దగా చేస్తుందని రాజమండ్రి నగరంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైతు బజార్లలో తమ పంటలను విక్రయించుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం మార్కెటింగ్ అధికారులను సంప్రదించాలని కోరారు.