News April 26, 2024

తూ.గో: మూడు రోజులు.. ఆరు సభలు.. పవన్ షెడ్యూల్

image

ఉమ్మడి జిల్లాలో ఈనెల 26, 27, 28 తేదీల్లో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా జనసేనాని పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారు చేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాజోలులోని మలికిపురం కూడలిలో.. 6 గంటలకు ద్రాక్షారామ సుభాష్‌చంద్రబోస్‌ కూడలిలో వారాహి విజయభేరి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శనివారం పెద్దాపురం, కాకినాడ గ్రామీణంలో బహిరంగ సభల్లో పాల్గొంటారు. 28న జగ్గంపేట, ప్రత్తిపాడు సభల్లో పాల్గొంటారు.

Similar News

News April 21, 2025

అర్జీలు పరిష్కారంలో అసంబద్ధ ఎండార్స్మెంట్లు ఇవ్వొద్దు: కలెక్టర్

image

అర్జీలు పరిష్కారంలో అసంబద్ధ ఎండార్స్మెంట్లు ఇవ్వకూడదని, అటువంటి ఎండార్స్మెంట్లు జారీ చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వస్తున్న అర్జీలను స్వీకరించడం, వాటికి తగిన విధంగా పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు.

News April 21, 2025

తూ.గో. జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో డీఎస్సీ ద్వారా 1,241 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు. ➤ OC-498 ➤ BC-A:88 ➤ BC-B:120 ➤ BC-C:13 ➤ BC-D:84 ➤ BC-E:48 ➤ SC-1:17 ➤ SC-2:79 ➤ SC-3:93 ➤ ST:74 ➤ EWS:120 ➤ PH-256:1 ➤ PH-05: 6. సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం << 16156039>>ఇక్కడ<<>> క్లిక్ చేయండి.

News April 21, 2025

తూ.గో: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

image

జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.

error: Content is protected !!