News June 4, 2024

తూ.గో: మూడు MP స్థానాల్లోనూ కూటమిదే హవా

image

ఉమ్మడి తూ.గో జిల్లా పరిధిలోని 3 పార్లమెంట్ స్థానాల్లోనూ కూటమిదే హవా కొనసాగుతోంది. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందీశ్వరీ(బీజేపీ) 2,35,469 మెజార్టీతో ఉన్నారు. అమలాపురం అభ్యర్థి గంటి హరీష్ మాధుర్(టీడీపీ) 3,07,849 ఓట్ల మెజార్టీతో ఉండగా… కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (జనసేన) 2,08,186 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అటు అసెంబ్లీ స్థానాల్లోనూ కూటమి విజయదుందుభి మోగిస్తోంది.

Similar News

News November 19, 2025

నేడు అన్నదాత సుఖీభవ నిధులు జమ: కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన 1,14,991 మంది రైతులకు PM-KISAN 21, అన్నదాత సుఖీభవ–2 పథకాల కింద మొత్తం రూ.7,699.90 లక్షల నిధులు జమ కానున్నాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ మేరకు బుధవారం నిడదవోలులో మంత్రి కందుల దుర్గేశ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆర్.ఎస్.కే స్థాయి వరకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

News November 18, 2025

రాజమండ్రి: నారా లోకేశ్ పర్యటన వాయిదా.. కారణం ఇదే

image

నవంబర్ 20న రాజమహేంద్రవరం సిటీలో జరగాల్సిన రాష్ట్ర ఐటీ,విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు నగర టీడీపీ కార్యాలయానికి సమాచారం అందింది. ఈ నెల 20వ తేదీన నితీష్‌కుమార్‌ బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి లోకేశ్ కూడా హాజరుకానున్నారు. అందువలనే పర్యటన వాయిదా పడినట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.