News July 21, 2024

తూ.గో: మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి

image

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువైంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.10 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజ్ నుంచి 7.72 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద 42.50 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరిందని అధికారులు పేర్కొన్నారు.

Similar News

News February 6, 2025

గోకవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

కొత్తపల్లి నుంచి కామరాజుపేట వెళ్లే జంక్షన్ వద్ద గురువారం బైక్ అదుపుతప్పి రోడ్డుపై యువకుడు పడిపోయాడు. దీంతో అతడి తలకు బలంగా దెబ్బ తగిలినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108కు కాల్ చేసి గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 6, 2025

నిడదవోలు: జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య 

image

నిడదవోలు చిన్నకాశీరేవులో చాగల్లు మండలం నందిగంపాడు గ్రామానికి చెందిన ఆతుకూరి లింగేశ్వరరావు(44) అనే వ్యక్తి గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. 10 ఏళ్ల నుంచి భార్య తనతో విడిపోయి దూరంగా ఉంటుందనే బాధతో మద్యానికి బానిసై జీవితం మీద విరక్తి చెంది చిన్నకాశీరేవులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. కందుల దుర్గేష్‌కు 2వ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. తూ.గో. జిల్లా మంత్రి కందుల దుర్గేష్‌కు 2వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం సూచించారు.

error: Content is protected !!