News June 24, 2024
తూ.గో.: యువతికి వేధింపులు.. కేసు నమోదు
యువతిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడికి చెందిన పండు కొంతకాలంగా ఓ యువతి వెంటపడి తిరుగుతున్నాడు. ఆమెను ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. దీంతో ఆమె సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. దీనిపై కేసు నమోదు చేశామని పోలీసులు ఆదివారం తెలిపారు.
Similar News
News November 7, 2024
తూ.గో: TODAY TOP NEWS
*ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొన్న కాకినాడ ఎంపీ
*మొన్న తిట్టారు.. ఇవాళ మెచ్చుకున్నారు: మంత్రి సుభాష్
*మండపేట: కారులో నుంచి చెలరేగిన మంటలు
*రాజమండ్రి మహిళకు మంత్రి లోకేశ్ హామీ
*పాశర్లపూడిలంకలో త్రాచుపాము హల్‌చల్
*కాకినాడ: హత్య కేసులో ఐదుగురు అరెస్ట్
*కాట్రేనికోన: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
*కాకినాడ: 11న ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్
*జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ: కలెక్టర్
News November 6, 2024
రాజమండ్రి మహిళకు మంత్రి లోకేశ్ హామీ
రాజమండ్రికి చెందిన శిరీష అనే మహిళ జీవనోపాధి కోసం బహ్రెయిన్ దేశానికి వెళ్లి అక్కడ శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు మంత్రి లోకేశ్‌కు ఎక్స్‌లో విన్నవించుకున్నారు. శిరీషను స్వదేశానికి తీసుకురావాలని పోస్టు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్ ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
News November 6, 2024
తూ.గో: గుంటూరు కోర్టుకు బోరుగడ్డ అనిల్ కుమార్
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు గుంటూరు తీసుకెళ్లారు. గతంలో అతనిపై తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో రెండు కేసులు, తాడికొండలో ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. బుధవారం గుంటూరు కోర్టులో హాజరు పర్చేందుకు పోలీసులు వాహనంలో తీసుకెళ్లారు. కోర్టులో హాజరు పరిచి తిరిగి రాజమహేంద్రవరం జైలుకు తీసుకురానున్నారు.