News February 5, 2025
తూ.గో: రూ.94.50 కోట్లతో 273 కి.మీల రోడ్లు పూర్తి

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రోడ్ల సమస్యకు ముగింపు పలికే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ Xలో పోస్టు చేసింది. “పల్లె పండుగ” ద్వారా గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం, డిప్యూటీ సీఎం పనిచేస్తున్నారని పేర్కొంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని గత 4 నెలల్లో 1,756 రోడ్లను రూ.94.50 కోట్ల వ్యయంతో 273.42 కిలో మీటర్ల మేర పూర్తి చేసినట్లు పేర్కొంది.
Similar News
News November 23, 2025
మిద్దె తోటల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది

మిద్దె తోటల పెంపకంలో సేంద్రియ ఎరువులైన పేడ, వేప పిండి వాడితే మట్టిసారం పెరిగి కూరగాయలు ఎక్కువగా పండుతాయి. ఎత్తుగా పెరిగే, కాండం అంత బలంగా లేని మొక్కలకు కర్రతో ఊతమివ్వాలి. తీగజాతి మొక్కల కోసం చిన్న పందిరిలా ఏర్పాటు చేసుకోవాలి. మట్టిలో తేమను బట్టి నీరివ్వాలి. * మొక్కలకు కనీసం 4 గంటలైనా ఎండ పడాలి. చీడపీడల నివారణకు లీటరు నీటిలో 5ml వేప నూనె వేసి బాగా కలిపి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేయాలి.
News November 23, 2025
కనిగిరిపై కనికరించండి.. మహాప్రభో.!

కనిగిరిని కొత్తగా ఏర్పడే మార్కాపురం జిల్లాలో కలపవద్దని ప్రజలు అంటున్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో నడుస్తున్న కనిగిరిని మళ్లీ కొత్త జిల్లాలో కలిపే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచిస్తున్నారు. రెవెన్యూ డివిజన్ కావాలన్న కల నెరవేరిన మూడేళ్లలోనే మళ్లీ మార్పులు వద్దన్న వాదన వినిపిస్తోంది. ప్రకాశం జిల్లాలోనే కనిగిరి ఉండాలా? కొత్తగా ఏర్పడే మార్కాపురం జిల్లాలోకి మారాలా? మీరేమనుకుంటున్నారో కామెంట్.
News November 23, 2025
గుంటూరు: రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా శ్రీనివాసరావు

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నామినేటెడ్ పదవుల కేటాయింపులో గుంటూరుకు ప్రాధాన్యత దక్కింది. ఈమేరకు రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా కళ్యాణం శివ శ్రీనివాసరావు నియమితులయ్యారు. జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్గా ప్రస్తుతం ఆయన పని చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడుగా పేరు పొందారు. ఆయన నియామకం పట్ల జనసేన పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


