News March 9, 2025
తూ.గో: రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఏఆర్ ఎస్ఐ మృతి

ఆటో ఢీకొని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజమండ్రిలోని స్వరూప్ నగర్కు చెందిన విశ్రాంత ఏఆర్ SI త్రిమూర్తులు (65) శనివారం మృతిచెందాడు. బొమ్మూరు ఎస్ఐ ప్రియకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ఆయన స్కూటీపై వెళుతుండగా శ్రీరామ్పురం ఫారెస్టు రోడ్డులో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన త్రిమూర్తులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు.
Similar News
News March 10, 2025
రాజానగరం: 12మంది క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

రాజానగరం హైవేని ఆనుకుని ఉన్న బ్రిడ్జ్ కౌంటీలోని ఒక విల్లాలో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాను రాజానగరం పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. వివిధ జిల్లాలకు చెందిన 12మంది బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 26 మొబైల్స్, 7 ల్యాప్ట్యాప్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దుబాయ్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఛాంపియన్షిప్ క్రికెట్ పోటీపై ఈ బెట్టింగ్స్ జరిగాయి.
News March 9, 2025
రాజమండ్రి: సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో ఇకపై ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటన విడుదల చశారు. ఈ మేరకు గతంలో మాదిరిగానే ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలియచేశారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
News March 9, 2025
కోరుకొండ: ఎత్తైన గిరిపై నరసింహుడు (PHOTO)

రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎత్తైన గిరిపై కొలువై ఉంది. ఇది రాజమండ్రికి 20 కిలోమీటర్ల దగ్గర్లో ఉంటుంది. నరసింహస్వామిని దర్శించుకోవటానికి నడకమార్గంలో సుమారు 615 మెట్లు ఎక్కాలి. చుట్టూ పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళ్లారా.. కామెంట్ చేయండి.