News December 20, 2024

తూ.గో: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన తూ.గో జిల్లా దివాన్‌చెరువులో గురువారం జరిగింది. మండపేట మండలం కేశవరానికి చెందిన చుక్కా శ్రీను(38) తన అత్తవారి గ్రామం శ్రీరాంపురానికి బయలుదేరాడు. దివాన్ చెరువు సెంటర్‌లో బైక్‌పై వెళుతున్న విద్యార్థి వెంకటరమణను శ్రీను లిప్ట్ అడిగి ఎక్కాడు. శ్రీరాంపురం సెంటర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో ఇద్దరూ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో శ్రీను మృతి చెందగా, వెంకటరమణకు గాయాలయ్యాయి.

Similar News

News October 26, 2025

సెలవు రోజులలో పాఠశాలలో తెరిస్తే కఠిన చర్యలు: DEO

image

మొంథా తుపాను నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు 27, 28 తేదీలలో 2 రోజులు సెలవులు ప్రకటించినట్లు DEO కంది వాసుదేవరావు ప్రకటించారు. తుపాన్ నేపథ్యంలో ప్రజలకు అవసరమైతే పునరావాసం కోసం HMలు అందుబాటులో ఉండి పాఠశాల భవనాలు ఇవ్వాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సెలవు దినాలలో రూల్స్ బ్రేక్ చేస్తూ పాఠశాలలు తెరిచిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని DEO హెచ్చరించారు.

News October 26, 2025

రాజమండ్రి: పాపికొండల విహారయాత్ర బోట్ల నిలిపివేత

image

తుపాన్ కారణంగా రాజమండ్రి నుంచి పాపికొండల విహారయాత్రకు బయలుదేరే బోట్లను నిలిపివేసినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. తుపాన్ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని ఆమె హెచ్చరించారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కూడా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు.

News October 26, 2025

తూ.గో: 1577 హెక్టార్లలో పంట నష్టం

image

తుపాను ప్రభావంతో శనివారం సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 1577.38 హెక్టార్లలో పంటకు పాక్షిక నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు తెలిపారు. దీనిలో 1374 హెక్టార్లలో వరి పంట నేలవాలగా, 183.29 హెక్టార్లు నీట మునిగాయన్నారు. 13 మండలాల పరిధిలోని 74 గ్రామాలలో 2,176 మంది రైతులకు పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఆయన వెల్లడించారు.