News May 25, 2024
తూ.గో: రోహిణి కార్తె.. సాగు పనులు ప్రారంభం

రోహిణి కార్తె ఆగమనం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఓ వైపు ఎండలకు భయపడుతూనే.. వానాకాలం దగ్గర పడిందంటూ సాగుకు సమాయత్తం అవుతున్నారు. సంబరంగా పనులు మొదలు పెట్టారు. రోహిణి కార్తె అనగానే రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని నానుడి. దీంతో పాటు తుపాన్ భయాలు ఉంటాయి. అయితే ప్రకృతి ధర్మాన్ని రైతన్న గౌరవిస్తూనే తనవంతు ధర్మం పాటిస్తూ హలం పట్టాడు. ఉభయ గోదావరి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఖరీఫ్ సందడి కనబడుతోంది.
Similar News
News November 8, 2025
తాళ్లపూడి: యాసిడ్ పడి ఇద్దరికి గాయాలు

తాళ్లపూడి మండలం పైడిమెట్టలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గోతులమయమైన రహదారిపై వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్ నుంచి కుదుపులకు యాసిడ్ లీకైంది. అది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పడటంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
News November 8, 2025
రేపు రాజమండ్రిలో ఉద్యోగమేళా

మెప్మా, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 9న (ఆదివారం) రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనక రాజు శనివారం తెలిపారు. విభిన్న రంగాలకు చెందిన 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ నుంచి పీజీ, బీటెక్, నర్సింగ్ చేసిన వారు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
News November 8, 2025
ఈనెల 10న యథాతధంగా పీజీఆర్ఎస్: కలెక్టర్

పీజీఆర్ఎస్ కార్యక్రమం ఈనెల 10 సోమవారం యథాతధంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వ్యయప్రయాసలకు గురి కాకుండా తమ డివిజన్, మండల కేంద్రాలు, గ్రామ-వార్డు సచివాలయాల్లోనే అర్జీలు సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. అలాగే 1100 టోల్ఫ్రీ నంబర్ లేదా meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.


