News August 18, 2024

తూ.గో.: వయస్సు 19 ఏళ్లు.. కేసులు 25

image

రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామానికి చెందిన పలివెల ప్రభుకుమార్ అలియాస్ ప్రభు (19) రాజమండ్రిలోని సంతోష్‌నగర్‌లో ఉంటున్నాడు. కాగా అతనిపై ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 25 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఒంగోలులో జరిగిన చోరీ ఘటనలో పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి, రాజానగరం, రాజోలు ప్రాంతాల్లోనూ కేసులు నమోదైనట్లు
ఆ జిల్లా SP దామోదర్ తెలిపారు.

Similar News

News September 15, 2024

దివాన్ చెరువు ప్రాంతంలో పులి కదలికలు: FRO భరణి

image

దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున చిరుతపులి కదలిక చిత్రాలు ట్రాప్ కెమెరాలో రికార్డు అయ్యాయని జిల్లా అటవీ శాఖాధికారిని భరణి తెలిపారు. చిరుత ప్రస్తుతం దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో సంచరిస్తుందని చిరుత కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను ఉపయోగిస్తున్నామన్నారు. పులిని ట్రాప్ బోనులతో పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని, దాన్ని కచ్చితంగా పట్టుకుంటామన్నారు.

News September 15, 2024

ఉప్పాడ సముద్రంలో అద్భుత దృశ్యం (PHOTO)

image

పిఠాపురం మండల పరిధిలోని ఉప్పాడ సముద్రంలో వరద నీరు కలిసే ప్రాంతంలో శనివారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఎరుపు రంగులో ఉన్న వరద నీరు భారీగా సముద్రంలో కలుస్తున్న వేళ ఒకవైపు నీలివర్ణం, మరోవైపు ఎరుపు వర్ణంతో కూడిన దృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. అన్నా చెల్లెళ్ల గట్టుగా పిలిచే ఈ ప్రాంతంలో వరద నీరు వస్తున్నన్నీ రోజులు ఇదే విధంగా ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.

News September 15, 2024

రాజమండ్రి: చిరుత కోసం 50 మంది

image

దివాన్ చెరువు అభయారణ్యంలో చిరుత సంచారం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అధికారులు దానిని బంధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అందుకు మొత్తం 50 మంది సిబ్బంది 9 బృందాలుగా ఏర్పడ్డారని DFO భరణి తెలిపారు. ఇళ్ల ముందు చెత్త వేయొద్దని కోరారు. చెత్తను తినేందుకు కుక్కలు, పందులు వస్తాయని వాటి కోసం చిరుత వచ్చే అవకాశం ఉందన్నారు. 16వ నంబర్ జాతీయరహదారిపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు.