News July 19, 2024
తూ.గో: విద్యుత్ సమస్యపై కంట్రోల్ నంబర్లు ఇవే..!

వర్షాల కారణంగా తూ.గో జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా సిబ్బందిని అందుబాటులో ఉంచామని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ టీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డివిజన్, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. రాజమండ్రిలో జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నెం.0883-2463354,7382299960, టౌన్ 94408 12585, రూరల్ 7382585487 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Similar News
News November 28, 2025
రాజానగరం: ధాన్యం కొనుగోళ్లపై జేసీ ఆరా

రాజానగరం మండలంలోని జి. ఎర్రంపాలెంలో ఈ ఖరీఫ్ సీజన్లో వరి పండించిన రైతులతో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ శుక్రవారం స్వయంగా మాట్లాడారు. పంట దిగుబడి వివరాలను తెలుసుకున్న ఆయన.. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా అని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లకు తోలిన ధాన్యానికి సంబంధించిన నగదు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతుందా లేదా అని ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News November 28, 2025
రాజమండ్రి: అన్నా క్యాంటీన్ను తనిఖీ చేసిన కమిషనర్

అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, సమయపాలన కచ్చితంగా పాటించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. శుక్రవారం ఆయన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి, రోజువారీ హాజరుపై ఆరా తీశారు. పేదలకు అందించే భోజనం ఎల్లప్పుడూ నాణ్యతగా ఉండేలా చూస్తూ, మెనూను తప్పకుండా పాటించాలని ఆయన ఆదేశించారు.
News November 28, 2025
మారిన తూ.గో స్వరూపం.. పెరిగిన ఓటర్ల సంఖ్య

జిల్లాల పునర్విభజనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా స్వరూపం మరోసారి మారనుంది. మండపేట నియోజకవర్గం అదనంగా చేరడంతో జిల్లాలో మండలాల సంఖ్య 21కి, నియోజకవర్గాల సంఖ్య ఏడు నుంచి ఎనిమిదికి పెరిగాయి. నవంబర్ 11 నాటికి జిల్లా ఓటర్ల సంఖ్య 16,23,528 ఉండగా, మండపేట నియోజకవర్గం చేరికతో మొత్తం ఓటర్ల సంఖ్య 18,37,852 కు పెరిగింది.


