News July 19, 2024

తూ.గో: విద్యుత్‌ సమస్యపై కంట్రోల్ నంబర్లు ఇవే..!

image

వర్షాల కారణంగా తూ.గో జిల్లాలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా సిబ్బందిని అందుబాటులో ఉంచామని ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ టీవీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు డివిజన్‌, జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. రాజమండ్రిలో జిల్లా స్థాయి కంట్రోల్‌ రూమ్‌ నెం.0883-2463354,7382299960, టౌన్‌ 94408 12585, రూరల్‌ 7382585487 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Similar News

News February 12, 2025

రాజమండ్రి: బ్యాంకర్లు కీలకపాత్ర వహించాలి: కలెక్టర్

image

అల్పాదాయ వర్గాలకు, రైతులకు, మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు రుణాలు మంజూరు, యూనిట్స్ గ్రౌండింగ్ ప్రక్రియలో బ్యాంకర్లు కీలకపాత్ర వహించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద బ్యాంక్ రీజినల్, పశుసంవర్ధక శాఖ తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రతి బ్యాంకర్లు వారి బ్యాంకు తరపున ఒక నోడల్ అధికారిని నియమించి సమాచారాన్ని అందచేయాలన్నారు.

News February 11, 2025

పెరవలి: బర్డ్ ఫ్లూ.. ఇంటింటి సర్వే

image

తూ.గో జిల్లా పెరవలి మండలం కానూరు పరిధిలో కోళ్ల ఫామ్‌లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో 10KMలలోపు ఇంటింటి సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. అదేవిధంగా చికెన్ షాపులను కొన్ని రోజులు మూసివేయడంతో పాటు, అక్కడ పని వాళ్లకూ వైద్య పరీక్షించాలన్నారు. ప్రజలకు ఏమైనా లక్షణాలు కనిపిస్తే కంట్రోల్ రూమ్‌ నంబరు 9542908025కు సమాచారం అందించాలన్నారు.

News February 11, 2025

అనపర్తి: ప్రమాదవశాత్తు లిఫ్టు గుంతలో పడి వ్యక్తి మృతి

image

అనపర్తిలో ప్రమాదవశాత్తు లిఫ్టులో గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. అనపర్తికి చెందిన సూర్యనారాయణ(65) తన కుమారుడు భాస్కరరావు నివసిస్తున్న అపార్ట్మెంట్‌కి వెళ్లి, తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో లిఫ్ట్ తెరిచి ఉన్నది చూసుకోకుండా లిఫ్టు గుంతలో పడ్డాడు. విషయం యజమాని భాస్కరరావుకు తెలపగా, అతను వచ్చి చూసేసరికి సూర్యనారాయణ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!