News May 19, 2024
తూ.గో.: వేసవి.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు

వేసవి నేపథ్యంలో ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 08321, 08322, 08325, 08326 నంబర్లు గల రైళ్ళ సేవలను మే 30 నుంచి జూన్ 29వ తేదీ వరకూ పొడిగించింది. ఈ రైళ్లు ఉమ్మడి తూ.గో జిల్లాలోని తుని, పిఠాపురం, సామర్లకోట, రాజమండ్రి మీదుగా ప్రయాణిస్తాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు.
Similar News
News April 23, 2025
రాజమండ్రిలో 25న మెగా జాబ్ మేళా

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 25న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి మురళి తెలిపారు. APSSDC & ప్రభుత్వం కళశాల (A) రాజమండ్రి సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఉ.9:30 గంటలకు ప్రారంభమవుతుందని, సుమారు 30కు పైగా ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటున్నాయని,యువత సద్వినియోగం చేసుకొవాలన్నారు.
News April 23, 2025
10th RESULTS: 6వ స్థానంలో తూర్పు గోదావరి

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 23,388 మంది పరీక్ష రాయగా 20,578 మంది పాసయ్యారు. 11,975 మంది బాలురులో 10,310 మంది, 11,413 మంది బాలికలు పరీక్ష రాయగా 10,268 మంది పాసయ్యారు. 87.99% పాస్ పర్సంటైల్తో తూర్పు గోదావరి 6వ స్థానంలో నిలిచింది.
News April 23, 2025
రాజమండ్రి: స్పా ముసుగులో వ్యభిచారం

రాజమండ్రిలో స్పాముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ స్పా సెంటర్పై పోలీసులు దాడులు నిర్వహించారు. SI ఆదినారాయణ వివరాల ప్రకారం.. బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని చెప్పి యువతులకు ఎరవేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. SIకు వచ్చిన సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఐదుగురు యువతులు, ఐదుగురు విటులు పట్టుబడ్డారు. స్పా నిర్వాహకుడు మదన్, మేనేజర్ తేజశ్రీని అరెస్టు చేసి కేసు దార్యప్తు చేస్తున్నారు.